Blue Whale : సముద్రం ఒడ్డున అరుదైన నీలి తిమింగలం..చూసేందుకు తరలివస్తున్న ప్రజలు
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పాత మేఘవరం – డి మరువాడ సముద్ర తీరాల మధ్య భారీ నీలి తిమింగలం ఒడ్డుకు కొట్టుకవచ్చింది
- By Sudheer Published Date - 11:07 AM, Fri - 28 July 23

శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) సంతబొమ్మాళి మండలం పాత మేఘవరం – డి మరువాడ సముద్ర తీరాల మధ్య భారీ నీలి తిమింగలం (Blue Whale) ఒడ్డుకు కొట్టుకవచ్చింది. సుమారు 25 అడుగుల పొడవు , ఐదు టన్నుల వరకు బరువు ఉంటుంది. దీనిని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు.
సముద్ర తీరంలో అరుదైన చేపలు, భారీ తిమింగలలు అప్పుడప్పుడు కొట్టుకవస్తుంటాయి. ఇలాంటివి అరుదుగా వస్తుండడం తో జాలర్లు , చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి చూస్తుంటారు. తాజాగా గురువారం కూడా అలాంటి నీలి రంగులో ఉన్న భారీ తిమింగలం (Blue Whale) ఒడ్డుకు కొట్టుకవచ్చింది. అయితే ఈ తిమింగలం చనిపోయింది. ఈ నీలి తిమంగలాన్ని బ్లూ వేల్ అంటారని మత్స్యకారులు చెబుతున్నారు. భారీ పరిమాణంతో చూడటానికి వింత జీవిలా ఉండటంతో.. దీనిని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు తరలి వస్తున్నారు. తిమంగలాన్ని పట్టుకొని యువత సెల్ఫీ లు తీసుకుంటున్నారు. ఇంతవరకు ఇలాంటి తిమంగలాన్ని చూడలేదని వారు చెపుతున్నారు. సముద్రంలో లోపల ఇలాంటివి ఉంటాయని వినడమే తప్ప చూడలేదని అంటున్నారు.
నీలిరంగుతో ఆహ్లాదకరంగా కనిపించే సముద్రం అల్పపీడన ప్రభావంతో గత వారం రోజులుగా అల్లకల్లోలంగా ఉంది. సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. దీంతో నీలి తిమింగలం చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు.
Read Also : Heavy Floods : మోరంచపల్లి లో నీరు పోయింది..కన్నీరు మిగిలింది