Telangana: మూడ్రోజులపాటు తెలంగాణలో ప్రియాంక పర్యటన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచార జోరును పెంచారు. తెలంగాణాలో అధికారం చేపట్టే దిశగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు.
- By Praveen Aluthuru Published Date - 02:26 PM, Tue - 21 November 23

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచార జోరును పెంచారు. తెలంగాణాలో అధికారం చేపట్టే దిశగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లిఖార్జున ఖర్గే లాంటి కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా మరోసారి ప్రియాంక గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రానున్నారు. మూడ్రోజులపాటు తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. నవంబర్ 24, 25, 27 తేదీలల్లో తెలంగాణకు ప్రియాంక గాంధీ రానున్నారు.మూడ్రోజులపాటు ఆమె తెలంగాణలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 24, 25, 27 తేదీలల్లో తెలంగాణకు ఆమె రానున్నారు. మూడు రోజుల్లో 10 నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తారు. 24వ తేదీన ఉదయం 11 గంటలకు పాలకుర్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు హుస్నాబాద్‌లో, సాయంత్రం 4 గంటలకు ధర్మపురి సభకి హాజరవుతారు. 25వ తేదీన పాలేరు, ఖమ్మం, వైరా, మధిర నాలుగు నియోజకవర్గాలలో ప్రచారం చేస్తారు. 27న 11 గంటలకు మునుగోడులో, 2 గంటలకు దేవరకొండ, 4 గంటలకు గద్వాల ప్రచార సభలల్లో ఆమె పాల్గొననున్నారు.
Also Read: Indian Navy Recruitment: ఇండియన్ నేవీలో అప్రెంటిస్‌షిప్ అవకాశం.. వారు మాత్రమే అర్హులు..!