Mahesh Kumar : మోడీ దేవుళ్ళ పేరుతో ఓట్ల బిక్షాటన చేస్తుండు – PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Modi : ఎన్నికలు వస్తున్నాయంటే చాలు మోడీ మతం, కులం, శ్రీరాముడు, హనుమంతుడు పేర్లు చెప్పి ఓట్లు అడుగుతుంటాడని కీలక ఆరోపణలు చేశారు.
- By Sudheer Published Date - 09:04 PM, Fri - 4 October 24

టీపీసీసీ (TPCC) గా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ (PCC President Mahesh Kumar Goud ) ను నిజామాబాద్ (Nizamabad)లో కాంగ్రెస్ కార్యకర్తలు సన్మానించారు. ఈ సందర్బంగా బిజెపి , బిఆర్ఎస్ పార్టీల పై నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీ దేవుళ్ళ పేరుతో రాజకీయం, ఓట్ల బిక్షాటన చేస్తుంటే..బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పులు పాలు చేసి ఫామ్ హౌస్కు పరిమితం అయ్యారని విమర్శించారు.
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు మోడీ మతం, కులం, శ్రీరాముడు, హనుమంతుడు పేర్లు చెప్పి ఓట్లు అడుగుతుంటాడని కీలక ఆరోపణలు చేశారు. పెద్ద పెద్ద కంపెనీలను వాళ్ల మిత్రులు అదానీ, అంబానీకి కట్టబెట్టారన్నారు. ఇటు తెలంగాణ విషయానికి వస్తే.. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పులు పాలు చేసి ఫామ్ హౌస్కు పరిమితం అయ్యి..మా ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు , విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక పీసీసీ అధ్యక్ష పదవి కోసం చివరి వరకు మధు యాష్కీ గౌడ్, నేను ఆహ్లాదకరమైన పోటీపడ్డామని.. ఆఖరి వరకు పోటీ ఉన్న చివరకు కలిసి పోయే తత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంటుందన్నారు.
38 ఏళ్లలో పదవుల కంటే కష్టాలు, నష్టాలే ఎక్కువ చవి చూశానని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి నాకు మంచి అనుబంధం ఉందని , కార్యకర్తల్లో ఎక్కడో కొంత నైరాష్యం ఉందని.. రాబోయే రోజుల్లో కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తామని కేడర్లో భరోసా నింపారు. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పని చేసే వారి జీవితాలో వెలుగులు నింపుతామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఇక దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబమని ప్రశంసించారు. రాజకీయ విభేదాలు ఉన్న మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత డీఎస్ నా రాజకీయ గురువేనని స్పష్టం చేశారు. నేను రాజకీయ కుటుంబం నుంచి రాలేదని, మాది వ్యవసాయ కుటుంబమని తెలిపారు.
Read Also : TDP Viral Tweet: వైఎస్ఆర్ ఎవరు..? ఆయనతో నాకేంటి సంబంధం అంటావా జగన్..?: టీడీపీ