No Demolition: కూల్చివేతలపై సుప్రీం కీలక నిర్ణయం, హైడ్రాకు బ్రేకులు?
No Demolition: తెలంగాణాలో హైడ్రా పేరుతో కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా పలు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. చెరువులను ఆక్రమించి అక్రమ కట్టడాలు చేపట్టిన అక్రమదారులకు హైడ్రా చుక్కలు చూపిస్తుంది. మరి సుప్రీం ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని హైడ్రా తమ చర్యలను కొనసాగిస్తుందా లేదా నిబంధనలు తమకు వర్తించబోవని కూల్చివేతలు కొనసాగిస్తుందా చూడాలి.
- By Praveen Aluthuru Published Date - 04:45 PM, Tue - 17 September 24

No Demolition: దేశవ్యాప్తంగా బుల్డోజర్ చర్యలను సుప్రీంకోర్టు (supreme court) మంగళవారం నిషేధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు దేశంలో ఎక్కడా ఏకపక్షంగా బుల్‌డోజింగ్ చర్యలు చేపట్టవద్దని కోర్టు పేర్కొంది. ఇది సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయినప్పటికీ. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేయనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ సూచనలను పాటించాలని పేర్కొంది.
కూల్చివేతలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను అక్టోబర్ 1న సుప్రీంకోర్టు విచారించనుంది. బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. దీన్ని నిలిపివేయాలని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ వరకు మా అనుమతితోనే చర్యలు తీసుకోవాలని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. రోడ్లు, ఫుట్‌పాత్‌లు, రైల్వే లైన్లపై అక్రమ నిర్మాణాలకు ఈ సూచన వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధంగా చట్టబద్ధమైన అధికారుల చేతులు కట్టలేమని అన్నారు. దీనిపై ధర్మాసనం మాట్లాడుతూ.. కూల్చివేతలను రెండు వారాల పాటు నిలిపివేస్తే ఆకాశం పడిపోదన్నారు.
ఇదిలా ఉండగా తెలంగాణాలో హైడ్రా (hydra) పేరుతో కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా పలు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. చెరువులను ఆక్రమించి అక్రమ కట్టడాలు చేపట్టిన అక్రమదారులకు హైడ్రా చుక్కలు చూపిస్తుంది.మరి సుప్రీం ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని హైడ్రా తమ చర్యలను కొనసాగిస్తుందా లేదా నిబంధనలు తమకు వర్తించబోవని కూల్చివేతలు కొనసాగిస్తుందా చూడాలి.
Also Read: CJI Warning: కోర్టులో రాజకీయ చర్చ ఏంటి.. సీజేఐ డీవై చంద్రచూడ్ ఉగ్రరూపం