HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >New Policy On Fee Reimbursement In Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

  • Author : Vamsi Chowdary Korata Date : 08-05-2026 - 10:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New Policy on Fee Reimbursement in Telangana
New Policy on Fee Reimbursement in Telangana

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ కొత్త పద్ధతిని అమలులోకి తెచ్చింది.

దరఖాస్తు సమయంలో విద్యార్థులు తమ పదో తరగతి హాల్‌టికెట్ నంబర్, పుట్టినతేదీ, ఉత్తీర్ణులైన సంవత్సరం వంటి వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత ఆధార్‌లోని పేరు, పదో తరగతి మెమోలోని పేరు సరిపోలితేనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటి దశ పూర్తయ్యాక విద్యార్థికి ఒక ఐడీ వస్తుంది. అనంతరం మీ-సేవ కేంద్రాల్లో ఆధార్ బయోమెట్రిక్ ప్రాసెస్ పూర్తి చేసి, ఆన్‌లైన్‌లో మిగతా వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. రెన్యువల్ విద్యార్థులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.

ఈ సంస్కరణలో భాగంగా ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఎస్సీ విద్యార్థులకు అందిస్తున్నట్లుగానే, ఇకపై ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు కూడా ట్యూషన్ ఫీజులు, స్కాలర్‌షిప్‌లను నేరుగా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనుంది. ప్రతి ఏటా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకుంటుండగా, ప్రభుత్వం సుమారు రూ.2400 కోట్లు ఖర్చు చేస్తోంది.

అధికారిక అంచనాల ప్రకారం సుమారు 20 శాతం మంది విద్యార్థులు తమ ఆధార్ వివరాలను సవరించుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా విద్యార్థులు తమ ఆధార్‌ కార్డులో పేరు, ఇంటిపేరులో ఉన్న తప్పులను ఈ వేసవి సెలవుల్లోనే సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో పాటు తమ మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో, ఆధార్‌ను బ్యాంకు ఖాతాతో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలి. అన్ని వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ప్రభుత్వం ఫీజులను మంజూరు చేస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aadhar card
  • biometric
  • Biometric Process
  • fee reimbursement
  • fee reimbursement in telangana
  • Scholarships
  • SSC Memo
  • telangana
  • Telangana Fee Reimbursement
  • telangana government
  • Telangana Scholarships

Related News

Another Metro Phase 3 in Hyderabad

హైదరాబాద్ లో మరో మెట్రో ఫేజ్-3.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్‌సిటీలోని స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల పొడవైన కొత్త కారిడార్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలని నిర్ణయించింది. ఈ మార్గాన్ని మూడో దశ కింద చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో ఈ ప్రా

  • Liquor Price

    Liquor Price Hike : తెలంగాణ మద్యం ప్రియులకు బిగ్ షాక్.. !!

  • Highest Liquor Sales

    Highest Liquor Sales: రికార్డ్ సృష్టించిన మందుబాబులు

  • Telangana Government Announces 2BHK Homes for HYDRA Victims

    HYDRA: హైడ్రా బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

  • Restraint is needed on water disputes: CM Revanth Reddy

    Telangana : సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు అందించే వస్తువుల సరఫరా పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Latest News

  • Bengal Politics: అసలు తగ్గేదేలే అంటున్న మమతా బెనర్జీ

  • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

  • T20 Captain: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

  • Revanth Reddy: CM, VIP కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.

  • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

Trending News

    • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

    • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd