HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mulugu Encounter Case High Court Orders To Preserve Mallaiahs Dead Body

Mulugu Encounter Case: ములుగు ఎన్‌కౌంటర్ కేసు.. మల్లయ్య డెడ్‌బాడీని భద్రపర్చండి.. హైకోర్టు ఆదేశాలు

ఎనిమిది మంది వైద్య నిపుణులతో మావోయిస్టుల(Mulugu Encounter Case) డెడ్‌బాడీలకు పంచనామా  చేయించామని రాష్ట్ర  ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

  • Author : Pasha Date : 03-12-2024 - 2:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mulugu Encounter Case High Court Mallaiahs Dead Body Eturnagaram

Mulugu Encounter Case : ఇటీవలే ములుగు జిల్లా ఏటూరునాగారంలోని చల్పాక అడవుల్లో జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్ కేసును తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారించింది. ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల మృతదేహాలకు సరిగ్గా పోస్టుమార్టం నిర్వహించలేదంటూ మావోయిస్టు మల్లయ్య భార్య దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘పోస్టుమార్టం చీకటిలో నిర్వహించారు. పంచనామా ప్రక్రియ సరిగ్గా జరగలేదు. రీపోస్టుమార్టం చేసేలా ఆదేశాలు ఇవ్వండి’’ అని ఆయన కోర్టును కోరారు.  ‘‘మావోయిస్టులకు తొలుత భోజనంలో విషం కలిపి ఇచ్చారు. అనంతరం కస్టడీలోకి తీసుకుని కాల్చిచంపారు’’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపించారు.

Also Read :Chinmoy Krishna Das : చిన్మయ్‌ కృష్ణదాస్‌‌ను ఏకాకి చేసే యత్నం.. వాదించేందుకు ముందుకురాని లాయర్లు

ఎనిమిది మంది వైద్య నిపుణులతో మావోయిస్టుల(Mulugu Encounter Case) డెడ్‌బాడీలకు పంచనామా  చేయించామని రాష్ట్ర  ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ‘‘ఇది బూటకపు ఎన్‌కౌంటర్ కాదు. ఆహారంలో ఎలాంటి విషం ఇవ్వలేదు. ఎన్‌హెచ్‌ఆర్సీ గైడ్‌లెన్స్‌ ప్రకారం పోస్టుమార్టం నిర్వహించాం’’ అని ఆయన చెప్పారు. ఎన్‌కౌంటర్‌ ఎలా జరిగింది ? ఆ వెంటనే ఏమేం చేశారు ? పోస్ట్ మార్టం రిపోర్ట్‌‌లో ఏముంది ? అనే వివరాలను తమకు సమర్పించాలని ఈసందర్భంగా పోలీసులను హైకోర్టు ఆదేశించింది. చనిపోయిన వారిలో మల్లయ్య మృతదేహం తప్ప మిగితా అందరి మృతదేహాలను వారివారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని న్యాయస్థానం పోలీసులకు నిర్దేశించింది. మల్లయ్య డెడ్‌బాడీని గురువారం(డిసెంబర్ 5) వరకు భద్రపర్చాలని నిర్దేశించింది.

Also Read :Minister: ఆర్ధిక ఇబ్బందులతో ఏ ఒక్కరి చదువు ఆగిపోవద్దు: మంత్రి

అయితే మావోయిస్టు మల్లయ్య మృత దేహాన్ని భద్రపర్చడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ అంశంపై తదుపరి విచారణను గురువారానికి హైకోర్టు వాయిదా వేసింది. గురువారం రోజు రాష్ట్ర ప్రభుత్వం నివేదికను ఇచ్చిన తరువాత తదుపరి చర్యలపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. పిటిషనర్‌గా మల్లయ్య భార్య ఉన్నందున ఆయన మృతదేహాన్ని భద్రపర్చాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కాగా, అంతకుముందు రోజు (సోమవారం) కూడా హైకోర్టులో ఇదే పిటిషన్‌పై విచారణ జరిగింది. మావోయిస్టుల డెడ్‌బాడీస్‌ను మంగళవారం వరకు భద్రపర్చాలని సోమవారం రోజు హైకోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • Eturnagaram
  • High Court
  • Mallaiahs Dead Body
  • mulugu
  • Mulugu Encounter Case
  • telangana
  • telangana highcourt

Related News

Bail granted to Bandi Bhagirath.

Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథకు లీగల్ పరంగా పెద్ద ఉపశమనం లభించింది. భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు గురువారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం హైకోర్టు తుది తీర్పు

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

  • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd