HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Dont Stop Anyones Education Due To Financial Difficulties Minister

Minister: ఆర్ధిక ఇబ్బందులతో ఏ ఒక్కరి చదువు ఆగిపోవద్దు: మంత్రి

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందన పట్ల విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. సార్ ఎంతో అప్యాయంగా మాట్లాడరని.. సారే స్వయంగా మా ఇబ్బందులు తెలుసుకొని, 5 సంవత్సరాల ఫీజును ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని భరోసా ఇచ్చారని విద్యార్ధులు తెలిపారు.

  • Author : Gopi Date : 03-12-2024 - 12:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister
Minister

Minister: ఆర్ధిక ఇబ్బందులతో ఏ ఒక్కరి చదువు ఆగిపోవద్దని మంత్రి (Minister) కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతిభకలిగిన ఏ నిరుపేద విద్యార్ధి చదువులు ఆర్ధిక ఇబ్బందులతో ఆగిపోకూడదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎవరైనా ఆర్ధిక ఇబ్బందులతో చదువుకోలేకపోతున్నరనే విషయం తెలిస్తే తన హృదయం తల్లడిల్లిపోతుందని తెలిపిన ఆయన.. ప్రతిభావంతులకు అండగా నిలబిడితే సమాజానికి మంచి జరుగుతుందని తెలిపారు. మంగ‌ళ‌వారం నల్గొండ జిల్లా ఎలికట్టకు చెందిన గుండె యుగేందర్, వెలిమినేడు గ్రామానికి చెందిన అంతటి శశి ప్రకాష్, గుండ్రంపల్లికి చెందిన రుద్రారపు కావేరీలు ఎంబీబీఎస్ సీట్లు సాధించినప్పటికి ఆర్ధిక సమస్యలతో చదువులు ఇబ్బందిగా మారాయనే విషయం చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మి నర్సింహా ద్వారా తెలుసుకున్న మంత్రి.. ముగ్గురు విద్యార్ధులను హైదరాబాద్ కు పిలిపించుకొని ఒక్కక్కరికి 65 వేల రూపాల‌య చొప్పున ఆర్ధిక సహాయం చేశారు.

ఇవే కాదు రాబోయే రోజుల్లో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 5 సంవత్సరాలకు సంబంధించిన ఫీజును చెల్లిస్తానని, చదువులకు అయ్యే ఇతర ఖర్చులు భరిస్తానని మంత్రి వారికి భరోసా కల్పించారు. మంచిగా చదువుకొని.. డాక్టర్లుగా పేదలకు సేవచేసి మంచిపేరు సంపాదించుకోవాలని ఆశీర్వదించారు.

Also Read: Apollo Medical College Convocation Utsav: అట్టహాసంగా అపోలో మెడికల్ కాలేజీ కాన్వకేషన్ ఉత్సవం

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందన పట్ల విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. సార్ ఎంతో అప్యాయంగా మాట్లాడరని.. సారే స్వయంగా మా ఇబ్బందులు తెలుసుకొని, 5 సంవత్సరాల ఫీజును ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని భరోసా ఇచ్చారని విద్యార్ధులు తెలిపారు. మంచిగా చదువుకొని పేదవాళ్లకు సేవ చేయాలని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మాటలు మాలో ఎక్కడలేని స్పూర్తి నింపాయని వారు తెలిపారు. ఒక్క సంవత్సరం చదువులకే నానా ఇబ్బందులు పడుతూ, లోలోన భయపడుతున్న మాకు.. కోమటిరెడ్డి సర్ భరోసా కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. మాలాంటి ఎందరో నిరుపేద విద్యార్ధుల చదువులకు అండగా నిలబడుతున్న కోమటిరెడ్డి సార్ కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నట్లు విద్యార్ధులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • education
  • Education News
  • hyderabad
  • minister komatireddy venkat reddy
  • Prathik Foundation
  • telangana
  • telugu news

Related News

Heavy Rain Forecast for Telangana

Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన

తెలంగాణలో పగటిపూట తీవ్రమైన ఎండలు, సాయంత్రానికి అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తూ భిన్నమైన వాతావరణం నెలకొంది. జూన్ 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. అకాల వర్షాల వల్ల కల్లాల్లోని ధాన్యం కొట్టుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. గత ఐదేళ్లలో ఈ ఏడాదే అత్యధికంగా వడగాల్పుల

  • RCB FANS

    HYD : ఐపీఎల్ సంబ‌రాలు.. హైద‌రాబాద్‌లో ఆర్సీబీ అభిమానుల ర‌చ్చ‌.. పోలీసుల లాఠీఛార్జ్‌

  • T Congress

    Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Komatireddy

    Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

Latest News

  • Periods: పీరియడ్స్ సమయంలో మహిళలు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదో తెలుసా?

  • Virat Kohli: కోహ్లీతో కలిసి అనుష్క శర్మ జోష్‌ఫుల్‌ డ్యాన్స్‌

  • Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకం..

  • Talliki Vandanam : తల్లికి వందనంపై కీలక అప్డేట్

  • IPL 2026: ఆర్సీబీకి వరుసగా రెండోసారి ఐపీఎల్‌ టైటిల్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd