HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Modi Telangana Election Campaign

Modi at Kamareddy : తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నుంచి విముక్తిని కోరుకుంటున్నారు – మోడీ

తెలంగాణ రైతుల కష్టాలు బీఆర్‌ఎస్‌కు పట్టడం లేదని , ప్రాజెక్ట్‌ల నిర్మాణం బీఆర్‌ఎస్‌కు ఏటీఎంలా మారిందని

  • By Sudheer Published Date - 05:33 PM, Sat - 25 November 23
  • daily-hunt
Modi Kmr
Modi Kmr

తెలంగాణ ఎన్నికల ప్రచారం (Telangana Election Campaign) చివరికి చేరుకోవడం తో తమ అభ్యర్థులను గెలిపేంచేందుకు జాతీయ నేతలు రంగంలోకి దిగారు. బిజెపి నుండి ప్రధాని మోడీ , అమిత్ షా , నడ్డా తదితరులు రంగంలోకి దిగగా..ఇటు కాంగ్రెస్ నేతలు రాహుల్ (Rahul) , ప్రియాంక , శివకుమర్ తదితరులు ప్రచారం చేస్తున్నారు.

ఈరోజు ప్రధాని మోడీ (Modi) కామారెడ్డిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు. ప్రజలు బీఆర్ఎస్ సర్కార్ తో విసిగిపోయారని, వారు మార్పు కోరుకుంటున్నారని మోడీ తెలిపారు. అలాగే ఏడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా జనాల్ని పట్టించుకోలేదని మోడీ ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ రైతుల కష్టాలు బీఆర్‌ఎస్‌కు పట్టడం లేదని , ప్రాజెక్ట్‌ల నిర్మాణం బీఆర్‌ఎస్‌కు ఏటీఎంలా మారిందని, తెలంగాణ అభివృద్ధికి ఖర్చు కావాల్సిన డబ్బులు బీఆర్‌ఎస్‌ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయని మోడీ ఆరోపించారు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతను బీఆర్‌ఎస్‌ మోసం చేసింది. పేపర్‌ లీకేజీలతో నిరుద్యోగ యువత దగా పడ్డారని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసమే బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందని , తెలంగాణ రైతుల కోసం బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. రైతులకు అదనంగా ఆదాయం వచ్చేందుకు కృషి చేస్తున్నాం అని తెలిపారు.

రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందని, సకల జనుల సౌభాగ్య తెలంగాణ కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణకు పసుపు బోర్డు సహా పలు హామీలు ఇచ్చామని, వాటిని నిలబెట్టుకున్నామని ప్రధాని మోడీ తెలిపారు. జాతీయ రాజకీయాల్లో హామీలు అమలు చేయడంలో బీజేపీకి తిరుగులేని రికార్డు ఉందని ప్రధాని మోడీ తెలిపారు.కేంద్రంలో ఆర్టికల్ 370 రద్దు, మహిళా బిల్లు, ట్రిపుల్ తలాక్ రద్దు, రైతులకు గిట్టుబాటు ధరలు, అయోధ్య రామాలయ నిర్మాణం సహా కేంద్రం నెరవేర్చిన పలు హామీల్ని ఈ సందర్భంగా ప్రధాని మోడీ తెలంగాణ ఓటర్లకు గుర్తుచేసారు. తెలంగాణలో అధికారమిస్తే బీసీని సీఎం చేస్తామని హామీ ఇచ్చామని ప్రధాని మోడీ తెలిపారు. ఇప్పటికే బీసీ వర్గాల నుంచి ప్రధాని, కేంద్రమంత్రుల సహా పలు పదవుల్ని బీజేపీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

Read Also : Rahul Gandhi: నిజామాబాద్‌ లో పోస్టర్ల కలకలం, రాహుల్ రాకను వ్యతిరేకిస్తూ పోస్టర్లు

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 telangana elections
  • BJP Meeting
  • kamareddy
  • modi

Related News

Bihar Elections Bjp

BJP : బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఏంటో తెలుసా..?

BJP : బిహార్‌లో సాధించిన ఘనవిజయంతో బీజేపీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన రాష్ట్రాలలో తన విజయం కొనసాగించాలని చూస్తోంది.

    Latest News

    • Andre Russell: ఐపీఎల్‌లో ఆండ్రీ రసెల్ కోసం రెండు జ‌ట్ల మ‌ధ్య పోటీ?!

    • Numerology : ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు బంగారం బాగా అదృష్టం తీసుకొస్తుంది.. తెలుసా.!

    • Telangana Cotton Crisis : పత్తి కొనుగోళ్లు బంద్.. గగ్గోలు పెడుతున్న రైతులు

    • BESS Solar Project : తెలంగాణలో అతిపెద్ద BESS సౌర ప్రాజెక్టు ఏర్పాటు

    • CM Revanth Reddy Speech : తెలంగాణ అభివృద్ధి దిశలో మరో పెద్ద సంకేతంగా సీఎం రేవంత్ వ్యాఖ్యలు

    Trending News

      • Maoist Hidma : వందల మంది మృతికి హిడ్మానే కారణం!

      • Madvi Hidma : ఏపీలో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ, అగ్రనేత హిడ్మా హతం.!

      • Nitish Kumar: బీహార్ సీఎంగా నితీష్ కుమార్.. మంత్రిత్వ శాఖలకు న‌యా ఫార్ములా?!

      • RCB: ఆర్సీబీపై ప్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ హౌస్ క‌న్ను!

      • iBomma: ఐబొమ్మ వ‌ల‌న ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి ఎంత లాస్ వ‌చ్చిందంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd