MLC Jeevan Reddy: ఢిల్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి .. సోనియా పిలుపు
సోనియా గాంధీ పిలుపు మేరకు జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేస్తారన్న వార్తలపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. జీవన్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు పార్టీని వీడితే అది కాంగ్రెస్ మీద ప్రభావం ఏ మాత్రం చూపనుందో సీనియర్ లీడర్లకు తెలుసు.
- By Praveen Aluthuru Published Date - 12:23 PM, Wed - 26 June 24

MLC Jeevan Reddy: సోనియా గాంధీ పిలుపు మేరకు జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేస్తారన్న వార్తలపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. జీవన్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు పార్టీని వీడితే అది కాంగ్రెస్ మీద ప్రభావం ఏ మాత్రం చూపనుందో సీనియర్ లీడర్లకు తెలుసు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ప్రయత్నించారు.
హైదరాబాద్‌లోని జీవన్‌రెడ్డి నివాసంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఏకాంతంగా సమావేశమైన నేపథ్యంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బుధవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని జీవన్‌రెడ్డిని నేతలు కోరారు.కాగా ఢిల్లీ హైకమాండ్ రంగంలోకి దిగింది. సోనియా గాంధీ పిలుపు మేరకు ఆయన ఢిల్లీకి వెళ్లానున్నారు. ఇవాళ మధ్యాహ్నం జీవన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
తనకు సమాచారం ఇవ్వకుండా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయన పార్టీ వీడేందుకు సిద్దమైనట్లు వార్తలు వచ్చాయి. అటు జీవన్ రెడ్డి సైతం తన పదవిని వదులుకోవడానికి సిద్ధమయ్యారు.
Also Read: Crorepati Employees: ఐటీ కంపెనీల్లో అధిక వేతనం పొందే ఉద్యోగుల సంఖ్య తగ్గుదల.. కారణమిదే..?