Graduate MLC Elections : స్థానిక సంస్థల ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలు రిహార్సల్స్ : ఉత్తమ్ కుమార్ రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దోహదపడతాయని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
- By Latha Suma Published Date - 08:26 PM, Tue - 11 February 25

Graduate MLC Elections : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు బంజారాహిల్స్‌లోని తన నివాసంలో పార్టీ శ్రేణులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టభద్రుల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దోహదపడతాయని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమన్నారు.
Read Also: Congress Party: పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు
క్షేత్ర స్థాయిలో కేడర్‌ను, లీడర్‌ను అప్రమత్తం చేసి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి విజయానికి రూట్ మ్యాప్ రూపొందించుకోవాలని నేతలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు రేపటి స్థానిక సంస్థల ఎన్నికలకు రిహార్సల్స్ అవుతాయన్నారు. పదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం వ్యవధిలోనే జరిగిన ఉపాధ్యాయ నియామకాలు మొదలు ప్రభుత్వం భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యగాల నియామకాలను విద్యార్థి, యువతకు వివరించాలన్నారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులకు, పార్టీ యంత్రాంగానికి నిరంతరం అందుబాటులో ఉంటానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం పరంగా సనస్యలు తన దృష్టికి తీసుక రాగలిగితే సత్వరం పరిష్కరించేందుకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు దుద్దిళ్ల శ్రీదర్ బాబు, పొన్నం ప్రభాకర్లతో పాటు శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, రాజ్ ఠాకూర్, డాక్టర్ సంజయ్, వెలిచాల రాజేందర్ రావు, మేడిపల్లి సత్యం, వడితేల ప్రణవ్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.
Read Also: Jeemain : జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలు విడుదల