Jeemain : జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాలు విడుదల
వీరిలో ఐదుగురు రాజస్థాన్‌కు చెందినవారే ఉన్నారు. ఇందులో తెలుగు తేజాలు కూడా ఉండటం విశేషం. ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ, తెలంగాణ నుంచి బాని బ్రత మాజీ 100 పర్సంటైల్ సాధించారు.
- By Latha Suma Published Date - 07:15 PM, Tue - 11 February 25

Jeemain : జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1లో మొత్తం 14 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించారు. వీరిలో ఐదుగురు రాజస్థాన్‌కు చెందినవారే ఉన్నారు. ఇందులో తెలుగు తేజాలు కూడా ఉండటం విశేషం. ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ, తెలంగాణ నుంచి బాని బ్రత మాజీ 100 పర్సంటైల్ సాధించారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లో తనిఖీ చేసుకోవచ్చు.
Read Also: MLC Kavitha : మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పోరాటాలు చేస్తాం: కవిత
దేశ వ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం.. జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్ -1 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షను దేశ వ్యాప్తంగా 12,58,136మంది రాశారు. ఇదిలా ఉండగా.. మొదటి విడత పరీక్షలో సాధించిన స్కోరుతో సంతృప్తి చెందని వారికి మరో అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక, ఫలితాన్నిచూడటానికి ముందుగా జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in కి వెళ్లాలి. తరువాత సెషన్ 1 స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌ను ఓపెన్ చేసి… ఆ తర్వాత అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి లాగిన్ అవ్వంలి. ఇక్కడ మీ ఫలితాన్ని చూసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కాగా, జేఈఈ మెయిన్ సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ ఇఫ్పటికే ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి 8 వరకు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి విడత పరీక్షలు రాసినవారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొదటి దశ పరీక్షలో సాధించిన స్కోరుతో సంతృప్తి చెందని వారు రెండో విడత పరీక్షలు రాస్తుంటారు.
Read Also: Soldiers Killed: జమ్మూ కాశ్మీర్‌లో భారీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి