HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Ponguleti Hot Comments On Kcr And Ktr

Minister Ponguleti: కేసీఆర్ కాళ్లే ప‌ట్టుకున్నా.. మంత్రి పొంగులేటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

.. బావ-బామ్మర్దులు నిత్యం ఇందిరమ్మ ప్రభుత్వం మీద గుడ్డకలిచి మీద వేస్తున్నారు. తల తాకట్టు పెట్టి అయిన డిసెంబర్ లోపే మిగతా 13 వేల కోట్లు రుణమాఫీ చేస్తాం. రుణ మాఫీ అయ్యాక నీ తల ఏ టైర్ కింద పెడుతావో ఆలోచించుకో. తప్పకుండా రైతు భరోసాను ఇందిరమ్మ ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వ భూములను నీ తొత్తులకు రాసి రైతు బంధు తిన్నారు.

  • Author : Gopi Date : 07-11-2024 - 4:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Ponguleti
Minister Ponguleti

Minister Ponguleti: బీఆర్ఎస్‌పై మంత్రి పొంగులేటి (Minister Ponguleti) శ్రీనివాస్ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తొర్రూర్ వ్యవసాయ నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తొర్రూరు మార్కెట్ కమిటీకి ప్రభుత్వం తరుపున అభినందనలు. కరెక్ట్ గా ఈరోజే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన రోజు. 11 నెలల ఇందిరమ్మ ప్రభుత్వంలో BRS అరాచకాలు ఒక్కొక్కటగా బయటపడుతున్నాయి. తెలంగాణ ప్రజల నెత్తురును బీఆర్ఎస్ దోచుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల కోసం కష్టపడుతున్నారు. రైతులకు 24 శాతం నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిందన్నారు.

ఇంకా మాట్లాడుతూ.. బావ-బామ్మర్దులు నిత్యం ఇందిరమ్మ ప్రభుత్వం మీద గుడ్డకలిచి మీద వేస్తున్నారు. తల తాకట్టు పెట్టి అయిన డిసెంబర్ లోపే మిగతా 13 వేల కోట్లు రుణమాఫీ చేస్తాం. రుణ మాఫీ అయ్యాక నీ తల ఏ టైర్ కింద పెడుతావో ఆలోచించుకో. తప్పకుండా రైతు భరోసాను ఇందిరమ్మ ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వ భూములను నీ తొత్తులకు రాసి రైతు బంధు తిన్నారు. ఈ పంట నుండి రైతులకు సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే స్మాట్ కార్డే అన్ని పథకాలకు పని చేస్తుంది. BRS ఉపఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మాత్రమే రేషన్ కార్డు ఇచ్చింది. ధరణి పేరుతో BRS నాయకులు, తొత్తులు కబ్జా చేశారు. HYD చుట్టూ ఉన్న భూములను BRS నాయకులు దోచుకున్నారన్నారు.

Also Read: Mother Kidnapped : కొడుకు అప్పు తీర్చడం లేదని.. తల్లిని కిడ్నాప్‌ చేసిన కాంట్రాక్టర్

BRS అరచాకలతో భూ వ్యవస్థను అస్తవ్యస్థం చేశారు. త్వరలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తాం.. అది దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈనెల ఆఖ‌రు లోపు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పెద్ద గుండె… పెద్ద మనస్సు. గ్రామసభల ద్వారా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. BRS నాయకులు లాగా బకాసురులను ఎంపిక చెయ్యం. మాజీ మంత్రి ఎర్రబెల్లి కక్కుతున్న విషం ప్రజలు గమనిస్తున్నారు. తప్పు చేస్తే.. పేద వాడిని ఇబ్బంది పెడితే.. కాపలాలాగా ఇందిరమ్మ ప్రభుత్వం ఉంటుందని హెచ్చ‌రించారు.

శ్రీనివాస్ రెడ్డి హోమ్ మంత్రా?… అలా ఎందుకు మాట్లాడుతున్నాడని అంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి క్యాబినెట్ మంత్రి..మంత్రిగా నేను ఏ శాఖ గురించి అయిన మాట్లాడవచ్చు. ఎర్రబెల్లి దయాకర్ ఎందుకు అంతా ఉలిక్కి పడుతున్నావు . కేటీఆర్ పాదయాత్ర చేస్తానంటే నేను వ్యక్తిగతంగా… కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. BRS అధికార మదంతో కండ్లు నేతికెక్కి కనీసం మనుషులుగా చూడలేదు. పాదయాత్ర చేస్తావా?… మోకాళ్ళ యాత్ర చేస్తావా? నువ్వు నిర్ణయం తీసుకో కేటీఆర్. ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఒకటో, రెండో కోట్లు ఇచ్చి మీ పాపాన్ని శుద్ధి చేసుకొండి. ఈ పార్టీ నేతలను.. ఆ పార్టీ నేతలను అరెస్టు చేస్తారని నేనెప్పుడూ చెప్పలేదు. మీరు ఎందుకు అంతా ఉలిక్కి పడుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి అంబానీ కాళ్ళు మొక్కడని ప్రచారం చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఎవరు కాళ్ళు పట్టుకోడు.. ఒకే ఒకసారి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా. నాయనాతో సమానంగా కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా కానీ నా గొంతుతో పాటు నమ్ముకున్న వాళ్ళ గొంతు కోసారన్నారు.

నాకు చట్టం తెలుసు.. ఎప్పుడూ, ఎక్కడ ఏమీ జరగాలో అది జరుగుతుంది. వరంగల్ జిల్లాను రెండో రాజధానిగా తప్పకుండా చేసి తీరుతాం. మామునూరు ఎయిర్‌పోర్టులో విమానాలు దించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వరంగల్ నగరం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పొంగులేటి కామెంట్స్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • cm revanth
  • congress
  • kcr
  • ktr
  • Minister Ponguleti Srinivas Reddy
  • telangana

Related News

IMD Alert

Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐఎమ్‌డీ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ అలర్ట్ శనివారం వరకు అమల్లో ఉండనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసర

  • KTR

    ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • MIssing Case

    Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

Latest News

  • Nandamuri Balakrishna: మా అమ్మ బసవతారకం క్యాన్సర్‌తో పోరాడి చనిపోయారు. బసవతారకం హాస్పిటల్ వెనుక ఉన్న ఆ కన్నీటి కథ ఇదే.. ఎమోషనల్ అయిన బాలయ్య!

  • Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. నెల రోజుల సీసీ ఫుటేజ్ మాయం

  • Sleep: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి!

  • Gold Price Today: పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర

  • Tirumala School: తిరుమల స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్య.. అసలు నిజం ఇదే..

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd