HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Great News For Gold Lovers Gold Prices Have Dropped Significantly

Gold Price Today: పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర

  • Author : Vamsi Chowdary Korata Date : 23-06-2026 - 11:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Great news for gold lovers... Gold prices have dropped significantly.
Great news for gold lovers... Gold prices have dropped significantly.

బంగారం ధరలు కొంత కాలంగా పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో భారీగా దిగొచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది ధరలు విపరీతంగా పెరగగా, ఈ ఏడాది కాస్త శాంతించాయని చెప్పొచ్చు. అయితే మళ్లీ మధ్యలో యుద్ధం ముగుస్తుందన్న అంచనాలతో క్రూడాయిల్ ధరలు తగ్గగా పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. అయితే ఇప్పుడు చూస్తే మళ్లీ భారీగా దిగొచ్చింది. గత 3 రోజుల వ్యవధిలో 2 సార్లు పెరగగా, ఇప్పుడు జూన్ 23న తగ్గుముఖం పట్టింది. ఇక్కడ క్రూడాయిల్ ధరలు దిగొస్తున్నప్పటికీ, ఇదే సమయంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమీప భవిష్యత్తుల్లో వడ్డీ రేట్లను పెంచొచ్చన్న అంచనాలు ఉన్నాయి. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్‌కు గిరాకీ పెరిగి, ఇదే సమయంలో బంగారం ఆకర్షణ కోల్పోతుంది. ధరలు దిగొస్తుంటాయి. ఇప్పుడు అదే జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల్లోనూ ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్లో తాజాగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకి కిందటి రోజు 4200 డాలర్లపైన ఉండగా, ఇది రాత్రికి రాత్రే 80 డాలర్లకు పైగా పతనమై ప్రస్తుతం 4130 డాలర్ల స్థాయికి చేరింది. సిల్వర్ రేటు కూడా భారీగా తగ్గి 63 డాలర్ల స్థాయికి చేరింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ ప్రస్తుతం రూ. 94.70 వద్ద ఉంది.

దేశీయంగా బంగారం ధరలు చూస్తే, తాజాగా 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1900 పెరగగా 10 గ్రాములకు రూ. 1,33,750 వద్ద ఉంది. దీనికి ముందు రూ. 1750 పెరగగా, జూన్ 20న రూ. 200 మేర పెరిగింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 2070 తగ్గి తులం రూ. 1,45,910 వద్ద ఉంది. ఇది గత 3 రోజుల్లో చూస్తే రూ. 220, రూ. 1900 మేర పెరిగింది.

లేటెస్ట్ గోల్డ్ జువెల్లరీ రేట్లు ఇవే..

దేశంలోని ప్రముఖ జువెల్లరీల్లోనూ జూన్ 23న ఉదయం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లలితా జువెల్లరీలో ఉదయం 10.20 గంటల సమయంలో గ్రాము గోల్డ్ రేటు రూ. 13,375 గా ఉంది. తనిష్క్ జువెల్లరీలో బంగారం ధరలు వార్త రాసే సమయానికి ఇంకా మారలేదు. ఇక్కడ గ్రాముకు రూ. 13,610 వద్ద ఉంది. ఖజానా, కల్యాణ్ జువెల్లర్స్, జోయాలుక్కాస్‌లో కూడా గ్రాము పసిడి ధర రూ. 13,375 వద్ద ఉంది.

రూ. 5 వేలు తగ్గిన సిల్వర్ రేటు..

బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా మళ్లీ దిగొచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో సిల్వర్ రేటు రూ. 5 వేలు తగ్గగా కేజీకి రూ. 2.50 లక్షల వద్ద ఉంది. సిల్వర్ ధర గత 8 రోజులుగా పెరగట్లేదు. ఈ క్రమంలో రూ. 30 వేల వరకు తగ్గడం విశేషం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22 Carat Gold Price Today
  • 24 Carat Gold Rate Down
  • 24K gold price today
  • Check Gold Rates
  • Daily gold price
  • Global Gold Prices
  • gold market . today gold price
  • gold price
  • Gold Price Today
  • Gold price today 22 carat

Related News

Good news... Gold prices have dropped significantly.

Gold Rates Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Gold Rates Today: నేడు బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. 24 క్యారెట్లు, 22 క్యారెట్లతో పాటు 18 క్యారెట్ల బంగారం ధరలు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. పసిడి ప్రేమికులకు భారీ ఊరటనిచ్చింది. గత కొన్ని రోజులుగా గరిష్ట స్థాయిల్లో కొనసాగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా కిందికి దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్ ప్రభావంతో హైదరాబాద్‌లో నేడు బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. 24 క్యారెట్లు, 22 క్

    Latest News

    • Joseph Ravan Remand Report: యూట్యూబర్‌ రావణ్‌కు మరోసారి రిమాండ్‌ పొడిగింపు

    • Balochistan: పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ ‘స్వాతంత్ర్యం ప్రకటించుకుంది’.. చైనా యొక్క 60 బిలియన్ డాలర్ల CPEC ప్రాజెక్టుకు అర్థం ఏమిటి?

    • Sonam Wangchuk: ‘నోటి ద్వారా లేదా IV ద్వారా మందులు వద్దు…’: చికిత్సకు ముందు కుటుంబ సభ్యుల అనుమతి తీసుకోవాలి అని సోనమ్ వాంగ్‌చుక్ భార్య డిమాండ్

    • KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్

    • Kuwait Desalination Plant: ఇరాన్ మొదట కువైట్ విద్యుత్, నీటి డీశాలినేషన్ ప్లాంట్ పై దాడి.. ఆపై తీవ్ర హెచ్చరిక జారీ చేసింది..

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd