HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Madiga Vishwarupa Sabha Today

Madiga Vishwarupa Sabha : మొన్న ‘బీసీ సభ – నేడు మాదిగ సభ’ పక్క వ్యూహంతో వెళ్తున్న బిజెపి

సభావేదికగా ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశముందని ఆ పార్టీ శ్రేణులు చెపుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ బీసీ, మాదిగ సమీకరణాలతో విజయం అందుకోవాలన్న ఆలోచనలో ఉందని ప్రధాని పర్యటలను బట్టి అర్థం చేసుకోవచ్చు

  • By Sudheer Published Date - 10:52 AM, Sat - 11 November 23
  • daily-hunt
Madiga Vishwarupa Sabha
Madiga Vishwarupa Sabha

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎలాగైనా ఈసారి కాషాయ జెండా ఎగురవేయాలని బిజెపి (BJP) పార్టీ పక్క వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే బిజెపి అధికారంలోకి వస్తే బీసీ నేతనే సీఎం (BC CM) చేస్తామని ప్రకటించగా..దానిని ప్రచారంలో బాగా వాడుకుంటుంది. ఇప్పటికే బరిలో నిల్చున్న అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తుండగా..కేంద్ర మంత్రులు , ప్రధాని సైతం ప్రచారంలో పాల్గొంటూ మరింత ఉత్సహం నింపుతున్నారు. మూడు రోజుల క్రితం బీసీ సభ (BC Sabha) నిర్వహించి సక్సెస్ చేసిన నేతలు..ఈరోజు బీజేపీ మాదిగ విశ్వరూప సభ (Madiga Vishwarupa Sabha) పేరుతో మరో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు కూడా ప్రధాని మోడీ (Modi) హాజరు అవుతున్నారు.

సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో సాయంత్రం సభ ప్రారంభంకానుంది. ఈ సభలోనూ ప్రధాని మోడీ పాల్గొని ఎన్నికల ప్రసంగించనున్నారు. అలాగే సభావేదికగా ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశముందని ఆ పార్టీ శ్రేణులు చెపుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ బీసీ, మాదిగ సమీకరణాలతో విజయం అందుకోవాలన్న ఆలోచనలో ఉందని ప్రధాని పర్యటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణపై ఈరోజు కీలక ప్రకటన చేసే అవకాశముంది.

We’re now on WhatsApp. Click to Join.

ఎస్సీ ఉప వర్గీకరణపై గత 3 దశాబ్ధాలుగా ఆ సంస్థ పోరాడుతోంది. దీంతో ఎన్నికల సందర్భంగా వారికి అనుకూలంగా ప్రకటన చేస్తే ఎస్సీల మద్దతు కూడగట్టుకోవచ్చే వ్యూహంలో ఉంది బీజేపీ. మరోపక్క వర్గీకరణ చేస్తే బీఆర్‌ఎస్‌ ప్రకటించిన దళితబంధు పథకానికి కౌంటర్‌ ఇవ్వొచ్చన ఎత్తుగడ కూడా చేస్తోంది. కాగా.. 2018 ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి అండగా నిలుస్తుందన్న ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో.. ఎస్సీ వర్గీకరణతో బీజేపీ వారికి గాలెం వేసే యోచనలో ఉంది. ఇక ఇప్పటికే ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాకుడు మందకృష్ణ మాదిగ కేంద్రహోం మంత్రి అమిత్‌షాను కలిసి ఎస్సీ ఉప వర్గీకరణ చేయాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేశారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించని మందకృష్ణ తెలపడం.. ఈరోజు మాదిగ విశ్వరూప పేరుతో మరో సభ నిర్వహించడం అందులో భాగమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇక ఎన్నికల సందర్భంగా ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజెపి శ్రేణులు.. సభను విజయవంతం చేసే దిశగా భారీగా జనసమీకరణపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు లక్ష మందిని తరలించే పనిలో మునిగారు పార్టీ శ్రేణులు.

Read Also : Chandra Mohan Died : సినీ నటుడు చంద్రమోహన్ కన్నుమూత


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • hyderabad
  • Madiga Vishwarupa Sabha
  • modi

Related News

Dharma Vijaya Yatra

Dharma Vijaya Yatra : శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న సీఎం రేవంత్

Dharma Vijaya Yatra : ధర్మ ప్రచారంలో భాగంగా శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామిజీ వారు హైదరాబాద్‌ నగరానికి విచ్చేసారు

  • Gold

    Gold Rate Today : ఈరోజు బంగారం ధర ఎంత తగ్గిందో తెలిస్తే నవ్వుకుంటారు..!!

  • Jublihils Campign

    Jubilee Hills By Election : ఓటర్ల మద్దతు ఎవరికీ..టెన్షన్ టెన్షన్ అవుతున్న అభ్యర్థులు

  • Jubilee Hills By Election

    Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్‌ఎస్‌ కథ పరిసమాప్తం అంటున్న మంత్రులు!

  • Office Rent

    Office Rent: దేశంలో ఆఫీస్ అద్దెలు ఎక్కువగా ఉన్న న‌గ‌రాలివే!

Latest News

  • Montha Cyclone : ప్రజలకు ఉచితంగా నిత్యావసరాలు అందిస్తున్న ఏపీ సర్కార్

  • Jahnavi Swaroop : సినిమాల్లోకి మహేశ్ బాబు మేనకోడలు!

  • Montha Cyclone : పెను తూఫాన్ నుండి ఏపీ ని కాపాడింది వీరే..!!

  • Jupally Krishna Rao : జూపల్లి ని దెబ్బ తీయాలని చేస్తుందేవరు..?

  • Montha Cyclone Effect : చిరుగుటాకులా వణుకుతున్న ఏపీ

Trending News

    • Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!

    • Madugula Halwa : ఫస్ట్ నైట్ కోసం స్పెషల్‌గా తయారు చేసే మాడుగుల హల్వా ..ఎలా చేస్తారో తెలుసా ?

    • Shreyas Iyer In ICU: శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐసీయూలో ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది?

    • Cyclone Montha : మాన్సూన్ తుపాను ప్రభావం పై చంద్రబాబు నాయుడు ట్వీట్: ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు చేపట్టాం.!

    • Andhra pradesh : ఏపీ ప్రజలకు మొంథా తుపాన్ అలర్ట్.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd