HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktrs Open Letter To Central Government On Petro Prices Hike

KTR Letter: పెట్రో ధరల దోపిడీపై కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ

పెట్రో ధరల దోపిడీపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖను రాశారు.

  • Author : Balu J Date : 31-03-2023 - 11:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR, bjp govt
Ktr And Modi

పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను నిలువునా దోచుకుంటున్నది. ఈ దోపిడీకి అంతర్జాతీయ ముడిచమురు ధరలను బూచిగా చూపించి కేంద్రం ఇంతకాలం చెప్పిన మాటలన్నీ కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయింది. 2013లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్లు ఉన్నప్పుడు, దేశంలో లీటర్ పెట్రోల్ రేటు కేవలం 76 రూపాయలు. కానీ నేడు బ్యారెల్ ముడిచమురు రేటు దాదాపు సగం పడిపోయినా.. అంటే 66 డాలర్లకు తగ్గినా, ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ కు 110 రూపాయలు ఉండడమే ఇందుకు నిదర్శనం. అందుకే దేశంలో పెట్రోల్ ధరల పెంపునకు కారణం ముడిచమురు కాదని, మోడీ నిర్ణయించిన చమురు ధరలేనని మనం గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైంది. కేవలం ముడి చమురును ఒక బూచిగా చూపించి తన కార్పొరేట్ మిత్రుల ఖజానాను లాభాలతో నింపేందుకు మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ ముడి చమురులు ధరలతో ఏమాత్రం సంబంధం లేకుండా దేశంలో పెట్రోల్ ధరను అమాంతం పెంచుకుంటూ పోతున్నది. పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచడం వల్ల దేశంలోని పేద, సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ధరల భారంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. 2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు 45% పైగా పెట్రో ధరల పెంపు వల్ల సరుకు రవాణా భారమై, సామాన్యుడు కొనుగోలు చేసే ప్రతి సరుకు ధర భారీగా పెరిగింది. నిత్యావసర వస్తువులు, కూరగాయల నుంచి మొదలుకొని పప్పు ఉప్పు వరకు అన్ని రకాల ప్రాథమిక అవసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. భారీగా పెరిగిన డీజిల్ ధరల వలన ప్రజా రవాణా వ్యవస్థ సంక్షోభం అంచున చేరుతోంది. దీంతో అన్ని రాష్ట్రాల్లో ప్రజా రవాణా చార్జీలను పెంచాల్సిన అనివార్య పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సృష్టించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల గత నలభై ఐదు సంవత్సరాలలో ఎప్పుడు లేనంత ద్రవ్యోల్భనం దేశాన్ని పట్టిపీడిస్తోంది.

ఇన్నాళ్లు అంతర్జాతీయ ముడి చమురు ధరల ప్రస్తావన లేదా ఉక్రెయిన్- రష్యా యుద్ధం పేరు చెప్పి దేశ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని మోడీ ప్రభుత్వం చేసింది. కానీ ఒకవైపు రష్యా నుంచి అత్యంత తక్కువ ధరకు చమురు దేశానికి భారీగా దిగుమతి చేసుకుంటున్నామని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, మరోవైపు తక్కువ ధరకు ముడిచమురు అందుబాటులో ఉన్నా, ప్రజల జేబుల నుంచి పెట్రోల్ ధరల పేరుతో చేస్తున్న దోపిడీకి మాత్రం సమాధానం చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న 35 వేల కోట్ల రూపాయల ముడిచమురు పొదుపు ప్రయోజనమంతా కేవలం ఒకటి రెండు ఆయిల్ కంపెనీలకే దక్కిందన్నది వాస్తవం. దేశీయ వినియోగం పేరు చెప్పి భారీగా రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడిచమురును, శుద్ధి చేసి తిరిగి విదేశాలకు అమ్ముకుంటున్న కీలకమైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పకుండా దాచి ఉంచుతుందన్నది. తక్కువ ధరకు ముడి చమురును కొని తిరిగి విదేశాలకే పెట్రోలు అమ్ముతున్న కంపెనీలకు వచ్చిన అడ్డగోలు లాభాలను దృష్టిలో పెట్టుకుని, దానిపై ప్రభుత్వానికి వచ్చే విండ్ ఫాల్ పన్నును కేంద్ర ప్రభుత్వం తగ్గించిన విషయాన్ని గమనించాలి.. కార్పొరేట్ కంపెనీలకు పన్నులు తగ్గించినప్పటికీ.. దేశ ప్రజల పట్ల మాత్రం పెట్రోల్ పేరుతో దోపిడీని కొనసాగిస్తున్న కఠినాత్ముడు ప్రధానమంత్రి మోడీ అని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరుతున్నాను.
అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 2013 సంవత్సరంలో ఉన్న స్థాయికి పడిపోయిన నేపథ్యంలో భారీగా పెంచిన, పెట్రోల్ రేటును తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా ప్రధానమంత్రి మోడీ సారధ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశ ప్రజల నుంచి పెట్రోల్ ధరల రూపంలో చేస్తున్న దోపిడీని ఆపాలని డిమాండ్ చేస్తున్నాను. మరోవైపు తెలంగాణ లాంటి రాష్ట్రాలు 2014 నుంచి ఒక్క రూపాయి వ్యాట్ ను పెంచకున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం సెస్సుల పేరుతో 30 లక్షల కోట్లకు పైగా ప్రజల నుంచి కొల్లగొట్టింది. కానీ ఈ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైకి నెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నది. అంతర్జాతీయంగా ముడిచమురు ధర 70 డాలర్ల లోపు చేరిన నేపథ్యంలో ఆ మేరకు పెట్రోల్ రేటును తగ్గించేందుకు కేంద్రం విధించిన సెస్సులను పూర్తిగా ఎత్తివేయాలి. పెట్రోల్ ధరలు తగ్గాలంటే దాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వంలోని బాధ్యత కలిగిన మంత్రులు చెప్పడం గురువింజ సామెతను తలపిస్తుంది. జీఎస్టీ పరిధిలో ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధరను 400 రూపాయల నుంచి 1200 కు పెంచిన అసమర్ధ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నది. ప్రపంచంలోనే అత్యధికంగా గ్యాస్ సిలిండర్ ధర పెంచిన బిజెపి ప్రభుత్వం రాష్ట్రాలకు కల్లబొల్లి కబుర్లు చెప్పడం అర్ధరహితం. ఇప్పటికే జీఎస్టీ పరిధిలో ఉన్న సిలిండర్ ధరలను కేంద్రం ఎందుకు తగ్గించలేకపోయిందో ముందు సమాధానం చెప్పాలి.

ఈ ధరల పెరుగుదల అంశం పార్లమెంటులో చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. అయితే దేశ ప్రజలు మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ పెట్రో దోపిడీని గమనిస్తున్నారు. పెరిగిన పెట్రోల ధరల తాలూకు దుష్పరిణామాలను అనుభవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే ఒక దోపిడీదారుగా మారి ప్రజల జేబులో నుంచి దోచుకుంటున్న పెట్రో భారం తగ్గాలంటే, భారతీయ జనతా పార్టీని వదిలించుకోవడమే ఏకైక మార్గం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ దోపిడీని ఆపాలి, లేకుంటే ప్రజల చేతిలో కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central govt
  • ktr
  • letter
  • petrol diesel price

Related News

KTR clarifies on organizations formed in his name

తన పేరుతో ఏర్పడిన సంస్థలపై కేటీఆర్ స్పష్టీకరణ

ముఖ్యంగా తెలంగాణలో ‘కేటీఆర్ సేవా సమితి’, ‘కేటీఆర్ సేన’ పేర్లతో కొన్ని సంఘాలు పని చేస్తున్నట్టు తెలిసిందని అయితే వాటికి తనతో ఎలాంటి సంబంధం లేదని ఆయన వెల్లడించారు.

  • Ktrslbc

    SLBC : ఇది రేవంత్ చేతకానితనానికి నిదర్శనం – కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

Latest News

  • జింబాబ్వేపై టీమిండియా ఘ‌న‌విజ‌యం!

  • ఏ పండు తినడం వల్ల శరీరానికి అధిక ప్రోటీన్ ల‌భిస్తుందో తెలుసా?

  • భూభారతి పేరుతో.. కాంగ్రెస్ మార్క్ అవినీతి: మాజీ మంత్రి హరీష్ రావు

  • జింబాబ్వేపై భార‌త్ విధ్వంసం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో రెండో అత్యధిక స్కోరు!

  • వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా సూప‌ర్ విక్ట‌రీ.. భార‌త్‌కు ఊర‌ట‌!

Trending News

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd