Telangana: రేవంత్ నోరు అదుపులో పెట్టుకో..
భాషను అదుపులో పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సలహా ఇచ్చారు. దూషణలు మానుకోవాలని ఆయన అన్నాడు.
- Author : Praveen Aluthuru
Date : 19-03-2024 - 4:58 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: భాషను అదుపులో పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సలహా ఇచ్చారు. దూషణలు మానుకోవాలని ఆయన అన్నాడు. రేవంత్ రెడ్డి వాడే భాషతో జైలుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ తప్పు చేశారని అనడం రేవంత్ మూర్ఖత్వమన్నారు. దళితుల బంధు, గొర్రెల పంపిణీ వంటి పథకాలు ఆగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు కొప్పుల.

కవిత అరెస్ట్‌తో పాటు పలు ఘటనలు తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం కవిత అరెస్ట్ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నామని భయపడి పార్టీలో చేరడం భావ్యం కాదన్నారు. తెలంగాణ ఉద్యమానికి నక్సల్స్ ఉద్యమం అసమానతలు, అణచివేత వల్లే పుట్టిందన్నారు. ఇలాగే కొనసాగితే తెలంగాణ గడ్డపై మరో ఉద్యమం తలెత్తుతుందని హెచ్చరించారు. అన్ని వర్గాలను కేసీఆర్ తన కడుపులో పెట్టుకున్నారని అన్నారు. బ్యాంకులకు లక్షల కోట్లు దోచి విదేశాలకు పారిపోయిన వారు కూడా ఉన్నారన్నారు.
Also Read: Etela Rajender : రేవంత్ సర్కార్ ను నీటి బుడగతో పోల్చిన ఈటెల