Congress : మీరు గ్యారంటీలు ఇస్తే.. మేం నిధులివ్వాలా? – కిషన్ రెడ్డి
Congress : రాష్ట్ర ప్రభుత్వాలు స్వంత నిధులతో ప్రాజెక్టులను అమలు చేయాలి గానీ, కేంద్రంపై ఆధారపడటం తగదని స్పష్టం
- Author : Sudheer
Date : 29-03-2025 - 4:12 IST
Published By : Hashtagu Telugu Desk
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ప్రకటించిన హామీలు, గ్యారంటీలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తీవ్రంగా స్పందించారు. రాష్ట్రాలు ప్రజలకు గ్యారంటీలు ఇస్తే వాటి అమలుకు నిధులు మాత్రం కేంద్రం ఇవ్వాలా? అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత పది ఏళ్లలో దేశవ్యాప్తంగా అనేక రహదారులు, ప్రాజెక్టులు అభివృద్ధి చెందినట్లు ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు స్వంత నిధులతో ప్రాజెక్టులను అమలు చేయాలి గానీ, కేంద్రంపై ఆధారపడటం తగదని స్పష్టం చేశారు.
Sensational Allegation : అతడు ఒకే రాత్రి ఐదుగురు అమ్మాయిలతో గడిపాడట: సీనియర్ డైరెక్టర్ వంశీ
అంతేకాదు భారతీయ జనతా పార్టీ (BJP) విధానం ఇతర పార్టీల కంటే భిన్నమని కిషన్ రెడ్డి తెలిపారు. ఇతర పార్టీల్లో తదుపరి నాయకుల గురించి ముందుగానే అంచనా వేసి చెప్పగలిగినా, BJPలో అలా కాదని, JP నడ్డా తరువాత ఎవరు అధ్యక్షుడు అవుతారో కూడా ఎవరికీ తెలియదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధికారం లోకి వచ్చినా, తాము ఇచ్చిన హామీల అమలు బాధ్యత పూర్తిగా తమదేనని, అది కేంద్రం నిధులతోనో లేదా రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతోనో పూర్తవుతుందని చెప్పారు.
ఇక దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ (ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ) అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపై కూడా కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. దేశంలో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. BJP పాలనలో ప్రజలకు న్యాయం జరిగే విధంగా అన్ని విధానాలను అమలు చేస్తామని అన్నారు. ప్రత్యేకంగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సమర్థవంతంగా వినియోగించడంలో విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ప్రభుత్వ తీరును సమీక్షించి, తగిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.