Sensational Allegation : అతడు ఒకే రాత్రి ఐదుగురు అమ్మాయిలతో గడిపాడట: సీనియర్ డైరెక్టర్ వంశీ
నా వెంట వచ్చిన ఒక యువ రైటర్.. నేను ఉండటానికి ఓ రూమ్‌ను(Sensational Allegation) చూపించాడు.
- Author : Pasha
Date : 29-03-2025 - 3:42 IST
Published By : Hashtagu Telugu Desk
Sensational Allegation : టాలీవుడ్ సీనియర్ ఫిల్మ్ డైరెక్టర్ వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1956 నవంబరు 20న తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో జన్మించిన వంశీ వయసు ఇప్పుడు 68 ఏళ్లు. నిక్కచ్చిగా, ముక్కుసూటిగా నిజాలు మాట్లాడటం ఆయన నైజం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీతో ముడిపడిన పలు కీలక విషయాలను వంశీ వెల్లడించారు.
Also Read :Sravan Rao at SIT : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. ‘సిట్’ ఎదుటకు శ్రవణ్ రావు.. వాట్స్ నెక్ట్స్ ?
అఫైర్ల విషయంలో..
సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు.. హీరోయిన్లు, డైరెక్టర్ల మధ్య అఫైర్లు ఉంటాయనే దాంట్లో 50 శాతం నిజం, 50 శాతం అబద్ధం ఉందని డైరెక్టర్ వంశీ చెప్పారు. అంటే అందరు హీరోలు, డైరెక్టర్లు ఒకేలా ఉండరని ఆయన తేల్చి చెప్పారు. ‘‘కొందరు హీరో, హీరోయిన్లు/ హీరోయిన్లు, డైరెక్టర్లు అఫైర్లను సినిమా తర్వాత కూడా కంటిన్యూ చేస్తుంటారు. ఇంకొందరు వాటిని సినిమా వరకే పరిమితం చేస్తారు’’ అని వంశీ పేర్కొన్నారు.
Also Read :Ghibli Trends : జిబ్లీ ట్రెండ్స్‌లోకి మోడీ, చంద్రబాబు, లోకేశ్.. ఏమిటిది ?
ఆ రూమ్‌లో అలా..
‘‘నేను సినిమా స్టోరీపై ఒక హీరోతో డిస్కస్ చేసేందుకు ఓసారి బ్యాంకాక్‌కు వెళ్లాను. నా వెంట కొందరు రైటర్స్‌ను కూడా తీసుకెళ్లాను. నా వెంట వచ్చిన ఒక యువ రైటర్.. నేను ఉండటానికి ఓ రూమ్‌ను(Sensational Allegation) చూపించాడు. ఆ రూమ్‌లో ఒక టాలీవుడ్ డైరెక్టర్ ఒకరాత్రే ఐదుగురు అమ్మాయిలతో గడిపాడని నాతో చెప్పాడు. ఆ మాటలు విని నేను షాకయ్యాను’’ అని డైరెక్టర్ వంశీ తెలిపారు.
వంశీ కెరీర్ గురించి..
- వంశీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో కెరీర్‌ను ప్రారంభించారు.
- 1982లో ‘మంచు పల్లకి’ సినిమాతో దర్శకుడిగా మారారు.
- ‘సితార’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.
- ‘అన్వేషణ’, ‘ప్రేమించు పెళ్లాడు’, ‘ఆలాపన’, ‘లేడీస్ టైలర్’, ‘మహర్షి’, ‘చెట్టు కింద ప్లీడర్’, ‘ఏప్రిల్ 1 విడుదల’, ‘డిటెక్టీవ్ నారద’, ‘జోకర్’, ‘ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు’ వంటి మూవీలకు డైరెక్టర్ వంశీయే.
- వంశీ తీసే సినిమాల్లో కామెడీ, సంగీతానికి కూడా ప్రాధాన్యం ఉంటుంది.
- వంశీ సినిమాల్లోని పాటలు అంటే సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ అని పేరుంది.