Chems*ex: కెమ్ సె*క్స్.. ఏమిటిది ? ఎలా చేస్తారు ? ఏమవుతుంది ?
ఆ తర్వాత సెక్స్‌లో పాల్గొంటారు. దీన్నే ‘కెమ్ సెక్స్’(Chemsex) అంటారు.
- By Pasha Published Date - 12:31 PM, Tue - 11 March 25

Chems*ex : ఆరోగ్యానికి డేంజర్ అని తెలిసినా.. సెక్స్ చేసే సమయంలో కొందరు పురుషులు వయాగ్రా వాడుతుంటారు. ఇటీవలి కాలంలో ‘కెమ్ సెక్స్’ గురించి కూడా పెద్ద చర్చ నడుస్తోంది. ఇంతకీ ఏమిటిది ? ఈ రకమైన సెక్స్‌లో ఏం చేస్తారు ? ఆరోగ్యానికి మంచిదేనా ? ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Ukraine Vs Russia: 73 డ్రోన్లతో మాస్కోపై ఎటాక్.. రెచ్చిపోయిన ఉక్రెయిన్
ఏమిటీ కెమ్ సెక్స్ ?
సెక్స్‌లో పాల్గొనడానికి ముందు.. దానిపై ఆసక్తిని పెంచే డ్రగ్స్, రసాయన ఔషధాలను తీసుకుంటారు. ఆ తర్వాత సెక్స్‌లో పాల్గొంటారు. దీన్నే ‘కెమ్ సెక్స్’(Chems*ex) అంటారు. ‘కెమ్’ అంటే రసాయనాలు(కెమికల్స్) అని అర్థం. అలసట లేకుండా ఎక్కువ సేపు సెక్స్‌లో పాల్గొనాలనే కోరికతో ఈ పద్ధతిని అనుసరిస్తుంటారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి ఐరోపా దేశాలతో పాటు అమెరికాలో ఈ తరహా సెక్స్ పద్దతిని ఎక్కువ మంది అనుసరిస్తున్నారు. ఈమేరకు వివరాలతో 2024 జూన్ 25న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఒక నివేదికను విడుదల చేసింది. హోమోసెక్సువల్ అంటే ఒకే లింగం వారు పరస్పరం సెక్స్ చేసుకోవడం. ఒక పురుషుడు, మరో పురుషుడితో.. ఒక స్త్రీ, మరో స్త్రీతో సెక్స్ చేయడం. హోమోసెక్సువల్స్‌లోని 31 శాతం మంది కెమ్ సెక్స్ పద్ధతిని అనుసరిస్తున్నారని నివేదిక వెల్లడించింది. ఆసియా పసిఫిక్ దేశాల్లో కొత్తగా నమోదైన ఎయిడ్స్ కేసుల్లో 43 శాతం కేసులకు పురుషులతో పురుషులు సెక్స్ చేయడమే ప్రధాన కారణమని తెలిపింది.
Also Read :Rambha : మళ్లీ వెండితెరపైకి రంభ.. కీలక అప్‌డేట్
వామ్మో.. ఇన్ని నష్టాలా ?
కెమ్ సెక్స్‌ను అలవాటుగా మార్చుకుంటే ప్రాణాల మీదికి రావడం ఖాయమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సెక్స్ కోసం కెమికల్ ఔషధాలు, డ్రగ్స్ వాడితే మానసికంగా, శారీరకంగా బలహీనపడతారని చెబుతున్నారు. శరీర బరువు తగ్గిపోయి, బాగా డీలా పడతారని వైద్యులు తెలిపారు. కెమ్ సెక్స్ సైడ్ ఎఫెక్ట్ వల్ల చివరకు లైంగిక సామర్థ్యం పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. తరుచుగా ముక్కు నుంచి రక్తం కారడం, చెవిలో ఏవో శబ్దాలు వినిపించడం, అతిగా కోపం రావడం, అనుమాన భావం పెరగడం వంటి లక్షణాలు కెమ్ సెక్స్ బాధితుల్లో కనిపిస్తాయి. కెమ్ సెక్స్ వల్ల ఎయిడ్స్, చర్మ వ్యాధులు, హెపటైటిస్ బీ వంటివి వచ్చే ముప్పు ఎక్కువ.