HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Polam Baata In Karimnagar

KCR Polam Baata: 10 వేల మంది రైతులతో మేడిగడ్డకు పోదాం: కేసీఆర్

సాగునీటికి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ బ్యారేజీకి నీటిని ఎత్తిపోసి విడుదల చేసేలా పోరాటం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.

  • Author : Praveen Aluthuru Date : 05-04-2024 - 5:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KCR Polam Baata
KCR Polam Baata

KCR Polam Baata: తెలంగాణలో ప్రస్తుతం రైతులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో పంట తీవ్రంగా నష్టపోయింది. మరోవైపు నీరు లేక ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతు సమస్య ప్రధానంగా కనిపిస్తుంది. రైతు సమస్యలపై బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది. రైతులను ఆదుకోవాలని కోరుతూనే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గత రెండ్రోజులుగా కేటీఆర్, హరీష్ రావు రైతు సమస్యలపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలనీ డిమాండ్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగి పంటలను పరిశీలించే కార్యక్రమం పెట్టుకున్నారు.

సాగునీటికి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ బ్యారేజీకి నీటిని ఎత్తిపోసి విడుదల చేసేలా పోరాటం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేసీఆర్ చేపట్టిన పొలం బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా మక్దుంపూర్ గ్రామంలో పర్యటించారు.

ఈ ప్రభుత్వానికి నీరు ఇవ్వాలనే ఉద్దేశం లేదు. పోరాటానికి సిద్ధంగా ఉండండి. నిరుత్సాహపడకండి. పంటలకు సాగునీరు అందాలంటే పోరాడాలి. లోక్‌సభ ఎన్నికల తర్వాత 10 వేల మంది రైతులను మేడిగడ్డకు నడిపిస్తానని, అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేలా చూస్తామని కేసీఆర్‌ గ్రామంలోని రైతులకు భరోసా ఇచ్చారు. గతంలో ఎకరాకు విత్తనం, ఇతర ఇన్‌పుట్‌ల కోసం చాలా మంది రూ.40 వేలు ఖర్చు చేశారని, అయితే సకాలంలో సాగునీరు అందకపోవడంతో పంట ఎండిపోయిందని రైతులు కేసీఆర్‌కు తెలిపారు.

We’re now on WhatsApp : Click to Join

మరికొంత మంది రైతులు కేసీఆర్‌ను తమ పొలానికి తీసుకెళ్లి ఎండిన వ్యవసాయ భూములు, వరి పంటలను చూపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందన్నారు. కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ఇంతటి దారుణమైన పరిస్థితిని తాము ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని కాంగ్రెస్ చెప్తుంది. నివేదిక రావాల్సి ఉందని, వెంటనే నష్టపోయిన రైతన్నలను ఆదుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది.

Also Read: Viral Video: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని గుద్దిన గంగిరెద్దు.. తప్పిన ప్రమాదం, వీడియో వైర‌ల్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 10000 Farmers
  • congress
  • farmers
  • Kaleshwaram
  • karimnagar
  • kcr
  • Medigadda
  • Polam Baata
  • telangana

Related News

Chiranjeevi Revanth Reddy Davos

ప్రపంచ ఆర్థిక సదస్సు దావోస్‌లో రేవంత్ రెడ్డితో చిరంజీవి

స్విట్జర్లాండ్లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కీలక అధికారులు హాజరయ్యారు. దావోస్‌కు రావాలంటూ చిరంజీవికి ఆహ్వానం జ్యూరిక్ లో చిరంజీవి ఉన్నట్టు తెలుసుకున్న రేవంత్ పెట్టుబ

  • Srisailam Dam

    శ్రీశైలం డ్యామ్ కు తక్షణ మరమ్మతులు అవసరం

  • Harish Rao Sit

    ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్, హరీష్ రావు ఫోన్ సైతం ట్యాప్ !!

  • Medaram Ammavari gold prasadam delivered to devotees' doorsteps..TGSRTC's innovative services

    భక్తులకు ఇంటి వద్దకే మేడారం అమ్మవారి బంగారం ప్రసాదం ..టీజీఎస్‌ఆర్టీసీ వినూత్న సేవలు

  • Mango Erragadda

    3 నెలల ముందుగానే మార్కెట్లోకి మామిడిపండ్లు

Latest News

  • తొలి టీ20లో టీమిండియా ఘ‌న‌విజ‌యం!

  • 77వ గణతంత్ర దినోత్సవ వేడుక‌లు.. నేరస్తులను గుర్తించేందుకు స్మార్ట్ గ్లాసెస్?!

  • ఏంటీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం?

  • న్యూజిలాండ్‌పై స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన టీమిండియా!

  • జొమాటో సీఈఓ ప‌ద‌వికి రాజీనామా చేసిన గోయ‌ల్‌!

Trending News

    • పాదయాత్ర పై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్

    • దావోస్ సదస్సులో ప్రేమాయణం… కెమెరాకు చిక్కిన ట్రూడో, కేటీ పెర్రీల రొమాంటిక్ కపుల్

    • వాట్సాప్ వినియోగ‌దారుల‌కు మ‌రో గుడ్ న్యూస్‌.. జూమ్‌, గూగుల్ మీట్‌కు గ‌ట్టి పోటీ?!

    • మీ భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న‌లో ఈ మార్పులు గ‌మ‌నిస్తున్నారా?

    • దేశంలో మ‌రోసారి నోట్ల ర‌ద్దు.. ఈసారి రూ. 500 వంతు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd