HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Is Certain To Become Chief Minister In 500 Days

KCR : 500 రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం ఖాయం..రాసిపెట్టుకోండి – కేటీఆర్ ధీమా

KCR : హైదరాబాద్‌లో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన హైడ్రా ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు

  • Author : Sudheer Date : 02-11-2025 - 5:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
kcr rule
kcr rule

హైదరాబాద్‌లో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన హైడ్రా ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో నగరం వేగంగా అభివృద్ధి చెందిందని, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టుల ద్వారా హైదరాబాద్‌ రూపురేఖలు మారాయని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో ఒక్క కొత్త నిర్మాణం కూడా ప్రారంభం కాలేదని విమర్శించారు.

Liquor Tenders in Telangana : మద్యం దుకాణం దక్కించుకున్న ప్రభుత్వ టీచర్..కాకపోతే !!

కేటీఆర్ మాట్లాడుతూ, హైడ్రా అధికారులు పెద్దవాళ్ల అక్రమ నిర్మాణాలను వదిలిపెట్టి పేదవారి ఇళ్లను మాత్రమే కూల్చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, అరికపూడి గాంధీ, రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, మాజీ మంత్రి వివేక్ ఇళ్లన్నీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పటికీ వాటిని కూల్చే ధైర్యం హైడ్రాకు లేదని కేటీఆర్ ప్రశ్నించారు. “పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఎందుకు?” అంటూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడితో అధికారులు కొందరి భూములకు పెన్సింగ్ వేస్తున్నారని, పేద ప్రజలను లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు.

రాహుల్ గాంధీని కూడా కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ రాజకీయాలను వ్యతిరేకించిన రాహుల్, తెలంగాణలో పేదల ఇళ్లు కూల్చుతున్న హైడ్రా చర్యలపై మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూల్చివేతలు తప్పని చెప్పి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పనిని ఎందుకు కొనసాగిస్తున్నారని ఆయన నిలదీశారు. 500 రోజుల్లోనే తెలంగాణలో బిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల కూల్చివేతల బాధను ప్రజలకు తెలియజేయడానికే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని కేటీఆర్ స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • congress
  • Jubilee Hills by-election
  • jubilee hills by-election campgin
  • kcr
  • ktr
  • Next Cm

Related News

Cm Revanth Reddy Kerala Cam

keralam Results : కేరళలో ‘రేవంత్’ ప్రభంజనం.. పినరయి కోటలో పాగా వేసిన తెలంగాణ ‘టైగర్’

దశాబ్ద కాలంగా పినరయి విజయన్ నాయకత్వంలో తిరుగులేని శక్తిగా ఉన్న లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (LDF)కు ఈసారి కేరళ ఎన్నికల్లో గట్టి సవాల్ ఎదురైంది

  • West Bengal Congress

    West Bengal Result 2026 : బెంగాల్లో కాంగ్రెస్ ‘జీరో’

  • Rahul Vote Chori Haryana

    Rahul : సెంచరీకి చేరువలో రాహుల్ అంటూ పరువు తీసిన బిజెపి

Latest News

  • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

  • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

  • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

  • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

  • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

Trending News

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd