Kadiyam Srihari: త్వరలో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వం.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..!
ఒక ఏడాది కాలంపాటు కార్యకర్తలంతా ఓపిక పడితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు.
- By Gopichand Published Date - 09:03 AM, Thu - 7 December 23

Kadiyam Srihari: ఒక ఏడాది కాలంపాటు కార్యకర్తలంతా ఓపిక పడితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి సంతాప సభలో పాల్గొన్న కడియం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా గందరగోళంగా ఉన్నారని అన్నారు. తమకు మిత్రపక్షమైన MIMతో కలిసి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు.
బీఆర్ఎస్ సర్కార్ రావడం పెద్ద ఇబ్బంది కాదని, కేసీఆర్ సింహంలా వస్తారన్నారు. సమయం చెప్పలేను కానీ మిత్రులతో కలిసి తమ స్థానాలు 56కు చేరుకుంటాయని చెప్పారు. సింహం రెండడుగులు వెనక్కి వేస్తోందంటే వేటకు సిద్ధమైనట్లే అన్నారు. కేసీఆర్ అనే సింహం త్వరలోనే బయటకు వస్తుందని, ఎవరూ అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని బీఆర్ఎస్,బీజేపీ రెండు పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కడియం శ్రీహరి తరహాలోనే బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఏడాది మాత్రమే నిలబడుతుందని.. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందంటున్నారు.
Also Read: 11 Ministers: సీఎంగా రేవంత్ తో సహా 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం.. ఆ 11 మంది వీళ్లేనా..?!
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ ఓడించింది. రాష్ట్రంలోని 119 స్థానాలకు గాను కాంగ్రెస్ 64 స్థానాలను గెలుచుకోగా, రాష్ట్రంలోని మెజారిటీ సంఖ్య 60 స్థానాలు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 39 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. దీంతో పాటు బీజేపీ 8, ఏఐఎంఐఎం 7, సీపీఐ 1 సీట్ గెలుచుకున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.