Telangana CS : తెలంగాణ సీఎస్‌గా రామకృష్ణారావు.. భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
రాష్ట్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులను విడుదల చేసింది. దీంతోపాటు తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లను(Telangana CS) బదిలీ చేశారు.
- By Pasha Published Date - 08:18 PM, Sun - 27 April 25

Telangana CS : తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి కె. రామకృష్ణారావు నియమితులు అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా రామకృష్ణారావు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు సీఎస్‌గా ఉన్న శాంతికుమారి ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. అందుకే కొత్త సీఎస్‌గా కె. రామకృష్ణారావును ఎంపిక చేశారు. నూతన సీఎస్ పోస్టు కోసం సీనియారిటీ ప్రకారం ఆరుగురు అధికారుల పేర్లను సీఎం రేవంత్ సర్కారు పరిశీలించింది. అయితే సమర్థత, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావును సీఎస్‌గా నియమించాలని నిర్ణయించింది. ఈయన 2014 నుంచి ఆర్థికశాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం, కేంద్ర నుంచి నిధులను రాబట్టడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అవసరాల దృష్ట్యా ఆయన్ని సీఎస్‌గా నియమించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం నియామక ఉత్తర్వులను విడుదల చేసింది. దీంతోపాటు తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లను(Telangana CS) బదిలీ చేశారు.
Also Read :Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడిపై రష్యా, చైనాలతో దర్యాప్తు : పాక్
తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
- గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్‌గా శశాంక్ గోయల్‌ను నియమించారు.
- ఇండస్ట్రీ, ఇన్వెస్ట్‌మెంట్ సెల్ సీఈవోగా జయేశ్ రంజన్‌ను నియమించారు.
- పరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక ముఖ్యకార్యదర్శిగా సంజయ్ కుమార్‌ను నియమించారు.
- ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్ నియమితులు అయ్యారు.
- కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానకిశోర్‌కు అవకాశమిచ్చారు.
- పట్టణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి (హెచ్‌ఎండీఏ వెలుపల)గా టీకే శ్రీదేవి, పట్టణాభివృద్ధి కార్యదర్శి (హెచ్‌ఎండీఏ పరిధి)గా ఇలంబర్తి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్‌గా కె.శశాంకను నియమించారు.
- జెన్‌కో సీఎండీగా ఎస్. హరీశ్‌ను, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవోగా నిఖిలను నియమించారు.
- ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా సంగీతం సత్యనారాయణ, దేవాదాయశాఖ డైరెక్టర్, యాదగిరిగుట్ట ఈవోగా ఎస్. వెంకటరావు, సెర్ప్ అదనపు సీఈవోగా పి. కాత్యాయనీదేవిలకు అవకాశం కల్పించారు.
- ఇండస్ట్రీ, ఇన్వెస్టిమెంట్ సెల్ అదనపు సీఈవోగా ఈవీ నర్సింహారెడ్డి, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా హేమంత్‌సహదేవ్ రావు, టీజీఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఫణీంద్రారెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్‌గా కధిరవన్, హైదరాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా విద్యాసాగర్, హెచ్‌ఎండీఏ సెక్రటరీగా ఉపేందర్ రెడ్డి నియమితులు అయ్యారు.