Praja Sangrama Yathra : వరంగల్ లో ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ.. హాజరుకానున్న జేపీనడ్డా!
తెలంగాణలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ముగింపు సందర్భంగా ఆగస్టు 26 న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కమలం పార్టీ యోచిస్తోంది.
- By Nakshatra Published Date - 09:00 PM, Thu - 28 July 22

తెలంగాణలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ముగింపు సందర్భంగా ఆగస్టు 26 న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కమలం పార్టీ యోచిస్తోంది. ఈసభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్న నేపథ్యంలో సభకు రెండు లక్షల మందిని సమీకరించాలని కాషాయ నేతలు భావిస్తున్నారు. సభ సక్సెస్ బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించినట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
అటు మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభసభలో ప్రసగించేందుకు మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆగస్టు 2న యాదాద్రిలో పర్యటించనున్నారు.ఈ సభకు లక్ష మందిని సమీకరించాలని కమలం పార్టీ యోచిస్తోంది. ఆగస్టు 2న యాదాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో యాత్ర ప్రారంభమై ఆగస్టు 26న హన్మకొండ శ్రీభద్రకాళి ఆలయంలో ముగుస్తుంది. యాదాద్రి-భువనగిరి, నల్గొండ, జనగాం, హమన్‌కొండ, వరంగల్ అనే ఐదు జిల్లాల్లో 325 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. సంజయ్ ఐదు జిల్లాల్లోని మూడు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమవుతారని, సమావేశాలు నిర్వహిస్తారని బీజేపీ నేతలు తెలిపారు.వివిధ ప్రాంతాల్లో జరిగే పాదయాత్రకు కేంద్ర మంత్రులు, బీజేపీకి చెందిన పలువురు నేతలు హాజరుకానున్నారు.
Related News

Vikarabad TRS: ప్రగతి భవన్ కు వికారాబాద్ నేతల పంచాయితీ!
అధికార పార్టీ టీఆర్ఎస్ లో లుకలుకలు మొదలయ్యాయి.