Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టులో విచారణ!
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై సోమవారం తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) విచారణ ప్రారంభమైంది.
- Author : Maheswara Rao Nadella
Date : 13-02-2023 - 12:35 IST
Published By : Hashtagu Telugu Desk
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ (Kamareddy Master Plan) పై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. మాస్టర్ ప్లాన్ నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టినట్లు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్లాన్ ను పక్కన పెట్టినట్లు వివరించింది. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ (Kamareddy Master Plan) పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, అవసరమైతే ముందుగా కోర్టుకు తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కోర్టుకు తెలియకుండా మాస్టర్ ప్లాన్ విషయంలో ముందుకెళ్లొద్దని సూచించింది. అదేవిధంగా సింగిల్ బెంచ్ లో ఉన్న మరో పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఇంప్లీడ్ చేసింది. మాస్టర్ ప్లాన్ పై దాఖలైన పిటిషన్ లో ఇంప్లీడ్ పర్సన్ గా డివిజన్ బెంచ్ ముందు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వాదనలు వినిపించారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలన్న డిమాండ్ కు ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికార పార్టీ నేతల భూముల విలువ పెంచేందుకే మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేశారని ఆరోపించాయి. మాస్టర్ ప్లాన్‌పై బాధిత రైతులు హైకోర్టును కూడా ఆశ్రయించారు.
Also Read: Veerasimha Reddy: హాట్ స్టార్ లో ‘వీరసింహా రెడ్డి’.. ఈ నెల 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్