Indiramma Atmiya Bharosa : అందుకే మహిళల ఖాతాల్లోకి నగదు బదిలీ : మంత్రి సీతక్క
గ్రామసభ నిర్ణయమే ఫైనల్ అని గ్రామసభ నిర్ణయాన్ని శిరసావహించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయాలని పేర్కొన్నారు.
- Author : Latha Suma
Date : 18-01-2025 - 1:25 IST
Published By : Hashtagu Telugu Desk
Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు మహిళల ఖతాల్లోనే జమ చేస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. ఇలాంటి పథకాన్ని తీసుకురావడం పేద కుటుంబం నుంచి వచ్చిన నాకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. మహిళా పక్షపాతి ప్రభుత్వం.. అందుకే మహిళల ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తున్నామని తెలిపారు. మానవీయ దృక్పథంతో, సామాజిక స్పృహతో అధికారులు వ్యవహరించాలని… సాంకేతిక కారణాలతో పేదలకు నష్టం వాటిల్ల లేకుండా చూడాలని వివరించారు. పేదలకు లబ్ధి చేకూర్చేలా, ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా అధికారులు పనిచేయాలన్నారు.
నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ చేతుల మీదుగా కూలీలకు ఆర్థిక చేత అందించడం సంతోషంగా ఉందని వివరించారు. చిన్న పొరపాటు జరిగినాన పేదలకు నష్టం వాటిల్లుతుందన్నారు. గ్రామ సభ వేదికగానే అర్హుల గుర్తింపు, లబ్ధిదారుల ఎంపిక జరగాలన్నారు. శాంతియుత వాతావరణంలో గ్రామ సభలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. గ్రామసభ నిర్ణయమే ఫైనల్ అని గ్రామసభ నిర్ణయాన్ని శిరసావహించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయాలని పేర్కొన్నారు.
కాగా, భూమిలేని నిరుపేద కూలీల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సుమారుగా 10 లక్షల మంది అర్హులు ఉంటారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రాథమికంగా అంచనా వేశాయి. భూమిలేని వ్యవసాయ కూలీలకు ప్రతి ఏటా రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది.
Read Also: Golden Baba : 6 కేజీల బంగారు ఆభరణాలతో గోల్డెన్ బాబా.. మహాకుంభ మేళాలో సందడి