HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Illegal Surrogacy And Egg Trading Gang Exposed Mother And Son Arrested

Hyderabad : అక్రమ సరోగసీ, ఎగ్ ట్రేడింగ్ ముఠా బట్టబయలు..తల్లి కొడుకులు అరెస్ట్

మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారులు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితురాలు నర్రెద్దుల లక్ష్మి రెడ్డి అలియాస్ లక్ష్మి, గతంలో ఎగ్ డోనర్ మరియు సరోగేట్ మదర్‌గా పనిచేసిన అనుభవం ఉంది.

  • Author : Latha Suma Date : 15-08-2025 - 3:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Illegal surrogacy and egg trading gang exposed.. Mother and son arrested
Illegal surrogacy and egg trading gang exposed.. Mother and son arrested

Hyderabad : మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్‌లో అక్రమ సరోగసీ మరియు ఎగ్ ట్రేడింగ్ కేంద్రాన్ని పోలీసులు గుర్తించి ముఠాను అరెస్ట్ చేశారు. ఇటీవలే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ద్వారా డాక్టర్ నమ్రత మోసం చేసిన ఘటన మరువక ముందే మరో ముఠా బట్టబయలైంది. వైద్యారోగ్య శాఖ మరియు మేడ్చల్ SOT, పేట్ బషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారులు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితురాలు నర్రెద్దుల లక్ష్మి రెడ్డి అలియాస్ లక్ష్మి, గతంలో ఎగ్ డోనర్ మరియు సరోగేట్ మదర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి, జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం తల్లి చేపట్టిన అక్రమ IVF, సరోగసీ కేంద్రాన్ని నడిపించడంలో సహకరిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు.

Read Also: Sajjala Ramakrishna Reddy : వైసీపీ పట్ల ప్రజల నమ్మకం నశించదు.. జగన్ విలువలు కలిగిన వ్యక్తి : సజ్జల

లక్ష్మిరెడ్డి ముఠా, డబ్బు అవసరమైన పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని ఎగ్ డోనర్‌లుగా, సరోగేట్ మదర్లుగా వాడుతున్నారు. మాదాపూర్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని, పిల్లలు లేని జంటల ఆవేదనను డబ్బుగా మార్చేలా ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నారు. చిలకలూరిపేటకు చెందిన లక్ష్మి రెడ్డి, నరేందర్ రెడ్డి హైదరాబాద్‌లోని సుచిత్ర, పద్మా నగర్ ప్రాంతాల్లో నివాసం ఉంటూ, అక్రమంగా ఈ క్లినిక్ నడుపుతున్నారు. వివిధ రాష్ట్రాల నుండి మహిళలను తీసుకొచ్చి, తన ఇంట్లో ఉంచి, IVF పద్ధతిలో గర్భధారణ చేయించేందుకు అవసరమైన మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వైద్యారోగ్య శాఖ ప్రాథమిక విచారణలో హెగ్డే, లక్స్ ఆసుపత్రులతో నిందితురాలు సంబంధాలు పెంచుకుని ఈ రహస్య కార్యకలాపాలు నడిపినట్లు తేలింది.

ఈ దాడిలో పోలీసులు నిందితుల వద్ద నుండి ₹6.47 లక్షల నగదు, లెనోవో ల్యాప్‌టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, సిరంజీలు, గర్భధారణ మందులు, హెగ్డే హాస్పిటల్ కేస్ షీట్లు, ఐదు స్మార్ట్‌ఫోన్లు, ఒక కీప్యాడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక, ఈ వ్యవహారానికి సహకరించిన ఇతరుల గుర్తింపుపై దర్యాప్తు కొనసాగుతోంది. లక్ష్మి గతంలో మహారాష్ట్రలో మానవ అక్రమ రవాణా కేసులోనూ నిందితురాలిగా ఉన్నట్లు సమాచారం. తాజాగా, సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (ART) యాక్ట్ మరియు భారతీయ శిక్షా స్మృతి (BNS) యాక్ట్‌ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో, పోలీసు విభాగాలు నకిలీ ఫర్టిలిటీ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టి, ఇలాంటి అక్రమ చర్యలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. పిల్లలు లేని దంపతుల నమ్మకాన్ని వాడుకుని డబ్బు కోసం ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మేడ్చల్ పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

Read Also: FASTag annual pass : అమల్లోకి ఫాస్టాగ్ వార్షిక పాస్‌.. ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలంటే?

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Basheerabad
  • Basheerabad Police
  • health department
  • hyderabad
  • Illegal surrogacy
  • Medchal District
  • Srishti Fertility Center

Related News

Pawan Cbn Hyd

Hyderabad : సైబరాబాద్ అనేది చంద్రబాబు విజన్ కు ప్రతిరూపం – పవన్

రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను, మహిళలను బూట్లతో తన్నించడం, దౌర్జన్యాలు చేయడం అమానుషమని మండిపడ్డారు. నాడు కనీసం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకే రక్షణ లేని పరిస్థితుల్లో, సామాన్య రైతులకు రక్షణ

  • Asbl Sriramanavami

    Sriramanavami : ఏఎస్‌బిఎల్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

  • Omkareshwara Temple

    Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

  • Uber Driver Booked For Obsc

    Hyderabad : రైడ్ బుక్ చేసిన మహిళకు దారుణమైన మెసేజ్ లు పంపిన ఉబెర్ డ్రైవర్

  • Petrol Shortage Full Demand

    Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!

Latest News

  • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

  • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

  • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

  • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

  • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd