HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Hyderabad Student Kills Friend For Talking To His Partner Say Police

Student Naveen Murder Case: అమ్మాయి కోసం హత్య.. విచారణలో విస్తుపోయే విషయాలు

హైదరాబాద్‌లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి పగ తీర్చుకునేందుకు తన స్నేహితుడినే నరికి చంపాడు. విద్యార్థి గుండెను కోసి, ప్రైవేట్ పార్ట్ కూడా వేరు చేసేంత దారుణంగా హత్య (Murder) చేశారు. మృతుడు తనతో గతంలో సంబంధం పెట్టుకున్న ప్రియురాలిని వేధించడంతో నిందితుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు.

  • Author : Gopi Date : 26-02-2023 - 11:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Crime
Crime

హైదరాబాద్‌లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి పగ తీర్చుకునేందుకు తన స్నేహితుడినే నరికి చంపాడు. విద్యార్థి గుండెను కోసి, ప్రైవేట్ పార్ట్ కూడా వేరు చేసేంత దారుణంగా హత్య (Murder) చేశారు. మృతుడు తనతో గతంలో సంబంధం పెట్టుకున్న ప్రియురాలిని వేధించడంతో నిందితుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఫిబ్రవరి 18న హైదరాబాద్ శివార్లలోని పెద్ద అంబర్‌పేట్‌లో ఈ హత్య జరిగింది. అయితే వారం రోజుల తర్వాత నిందితుడు పి.హరిహరకృష్ణ పోలీసులకు లొంగిపోవడంతో వెలుగులోకి వచ్చింది. 21 ఏళ్ల యువకుడు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన స్నేహితుడు నవీన్ ని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

కృష్ణ, నవీన్‌లు దిల్‌సుఖ్‌నగర్‌లో కాలేజీ చదువుతున్న రోజుల్లో స్నేహితులు అని పోలీసుల విచారణలో తేలింది. ఆ సమయంలో నవీన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. కాని కొన్ని విభేదాల కారణంగా వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆ అమ్మాయి కృష్ణతో సన్నిహితంగా మెలిగింది. నవీన్ ఆ అమ్మాయికి కాల్ చేయడం, మెసేజ్ చేయడం ప్రారంభించాడని, ఆమె ఆ విషయాన్ని కృష్ణకు చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన కృష్ణ.. నవీన్‌ని చంపాలని ప్లాన్ చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లా చారుకొండ మండలం సిరిసనగండ్లకు చెందిన నేనావత్ నవీన్ నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇతడి స్నేహితుడు హరిహర కృష్ణ.. అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. వీరిద్దరూ దిల్ సుఖ్ నగర్ లో ఇంటర్మీడియెట్ క్లాస్ మెట్స్. వీరితో పాటే ఇంటర్ చదివిన యువతిని.. ఇద్దరూ ప్రేమించారు. దీంతో.. వీరి మధ్య మనస్ఫర్దలు వచ్చాయి.

Also Read: 2 Buses Gutted: తప్పిన పెను ప్రమాదం.. నేషనల్ హైవేపై రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం

ఫిబ్రవరి 17వ తేదీన సాయంత్రం ఫోన్ చేసి నవీన్ ని అబ్దుల్లాపూర్ మెట్ కు పిలిపించిన నిందితుడు హరిహరకృష్ణ.. నవీన్ ను చెట్లపొదల్లోకి తీసుకెళ్లి హత్య చేశాడు. నవీన్ కనిపించట్లేదని ఫిబ్రవరి 22న తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు మిత్రుడు హరిహర కృష్ణ ఈ హత్య చేసినట్లు తెలుసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిత్రుడు నవీన్ ను హత్య చేసేందుకు హరిహరకృష్ణ కొన్ని రోజుల ముందే కుట్ర పన్నాడు. షాపింగ్‌ మాల్‌లో 2 నెలల క్రితం కత్తి కొనుగోలు చేసిన నిందితుడు.. కొన్నాళ్లుగా ద్విచక్రవాహనంలో కత్తి పెట్టుకుని తిరిగాడు.

ఫిబ్రవరి 17న పార్టీ పేరుతో హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన స్నేహితుడి రూమ్ కు నవీన్ ను హరి పిలిచాడు. పార్టీలో ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. తాను ప్రేమించే యువతితో క్లోజ్ గా ఉండటం జీర్ణించుకోలేని హరి.. నవీన్ ను దారుణంగా హత్య చేసి గుట్టల్లో పడేశాడు. హత్య సమయంలో చేతికి గ్లౌజులు వేసుకున్న హరిహరకృష్ణ.. మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా దుస్తులు తొలగించాడు. అతడి గుండెను, వేళ్లను కోసేశాడు. ఆ ఫోటోలు తన ప్రేయసికి వాట్సాప్ లో పంపించగా.. సదరు యువతి గుడ్ బాయ్ అంటూ రిప్లై ఇవ్వడం గమనార్హం. ఈ విషయాలన్నీ తెలుసుకొని విస్తుపోయిన పోలీసులు.. నిందితుడి మానసికస్థితి గురించి ఆరా తీస్తున్నారు. ఇంత క్రూరంగా చంపడానికి కారణాలను విశ్లేషిస్తున్నారు. గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య కేసులో అమ్మాయి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు ఎల్బీ నగర్ డీసీపీ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • crime news
  • hyderabad
  • Murder case
  • Student Naveen Murder Case
  • telangana

Related News

The chicken curry that took the life of the father

Chicken Curry: తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర

కొన్ని చిన్న చిన్న విషయాలు ఇళ్లల్లో పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. ఇలాంటి గొడవలు చివరికి హత్యలు, ఆత్మహత్యల వరకు వెళ్లిన సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. భార్యాభర్తలు, తల్లీకుమార్తెలు, తండ్రి కొడుకుల మధ్య చిన్నగా మొదలైన మాటలు కాస్తా.. చివరికి ఎవరో ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ ఇంట్లో నాటుకోడి కూర వండాలనే విషయంలో జరిగిన ఘర్షణ చివరికి తండ్రిన

  • Amit Shah makes key remarks on alliances in Telangana.

    Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

  • Nepali Gang Loots Gold In Hyderabad

    Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

  • Heavy Rain Forecast for Telangana

    తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

Latest News

  • Mavilan : రైతులకు గుడ్ న్యూస్.. కోర్టెవా ‘మావిలాన్’ ఆవిష్కరణ

  • BITS Pilani : ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా – బిట్స్ పిలానీ

  • Amazon : అమెజాన్ ‘స్మార్ట్ ఛాయిస్’..ఎలక్ట్రానిక్స్ షాపింగ్‌లో సరికొత్త విప్లవం

  • Goddesses Lakshmi: ఇలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది..!!

  • Zomato: జొమాటో కు షాక్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 9.6 కోట్ల జీఎస్‌టీ నోటీసు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd