HYD -Bijapur Highway : ఇది దారి కాదు..యమలోకానికి రహదారి
HYD -Bijapur Highway : తెలంగాణ లో గత కొద్దీ రోజులుగా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోడ్లు బాగుండకపోవడం , నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇలా పలు కారణాలతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి
- By Sudheer Published Date - 10:35 AM, Tue - 4 November 25
తెలంగాణ లో గత కొద్దీ రోజులుగా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోడ్లు బాగుండకపోవడం , నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇలా పలు కారణాలతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి (NH–163)పై ప్రయాణించడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమేనని స్థానికులు వాపోతున్నారు. ఈ మార్గం రహదారిగా కాకుండా రాకాసి రహదారిగా మారిందని వారు చెబుతున్నారు. సుమారు 46 కి.మీ. పొడవైన ఈ రోడ్డంతా గుంతలతో నిండిపోయి ఉంది. వర్షాకాలంలో ఈ గుంతలు మినీ కుంటలుగా మారి వాహనదారులకు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. తగిన లైటింగ్ లేకపోవడం, సిగ్నల్‌లు సరిగా లేకపోవడం, స్పీడ్‌బ్రేకర్లు లేకపోవడం వల్ల రాత్రిపూట ప్రయాణం కష్టసాధ్యమవుతోంది.
Accidents : ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు..ఎక్కడెక్కడంటే !!
2018 నుండి ఇప్పటివరకు ఈ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదాలు 200 మందికి పైగా ప్రాణాలను బలితీసుకోగా, మరో 600 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు ప్రతి వారం ఈ మార్గంలో ఒకటి లేదా రెండు ప్రమాదాలు జరగడం సాధారణ విషయంగా మారింది. ట్రక్కులు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు — అన్నింటికీ ఇది ప్రధాన రూట్‌గా ఉండటంతో ట్రాఫిక్ కూడా అధికంగా ఉంటుంది. గుంతల వల్ల వాహనాలు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న వాహనాలకు ఢీ కొడుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. రోడ్డు సంరక్షణలో నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ ల సడలింపు, అధికారుల తగిన పర్యవేక్షణ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో కోట్లలో మోసం..చిక్కుల్లో విడదల రజని
ఇక తాజాగా అన్ని అడ్డంకులు తొలగడంతో రహదారి విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించే యోచనతో జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) ముందడుగు వేసింది. భూమి స్వాధీనం, అనుమతులు, టెండర్ ప్రక్రియ పూర్తికావడంతో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. స్థానికులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, “ఇకనైనా ఈ రహదారి యమలోకం దారిలా కాకుండా సురక్షిత మార్గంగా మారాలని” కోరుకుంటున్నారు. విస్తరణ పనులు సకాలంలో పూర్తయితే అనేక ప్రాణాలు కాపాడతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.