HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Huge Tunnel Found In Karreguttalu On Chhattisgarh Telangana Border

Maoists Tunnel : కర్రెగుట్టల్లో భారీ సొరంగం.. మావోయిస్టుల కదలికలపై కీలక సమాచారం

భద్రతా బలగాలు ఆరు రోజుల క్రితం కర్రె గుట్టల్లోకి(Maoists Tunnel) ఎంటరయ్యాక.. ఈ సొరంగాన్ని మావోయిస్టులు వదిలి పారిపోయినట్లు అంచనా వేస్తున్నారు.

  • Author : Pasha Date : 27-04-2025 - 1:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Maoists Tunnel Karreguttalu Chhattisgarh Telangana Border

Maoists Tunnel : ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లో భారీ సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. దాదాపు 1000 మంది మావోయిస్టులు తలదాచుకునేందుకు వీలుగా దీని నిర్మాణం ఉంది. లోపల పెద్ద మైదానం కూడా ఉంది. సొరంగంలో నీటి వసతి, ఇతర సౌకర్యాలు సైతం ఉన్నట్లు సమాచారం. కొన్ని నెలల పాటు మావోయిస్టులు ఈ సొరంగంలోనే ఉన్నట్లు భద్రతా బలగాలు చెబుతున్నాయి. కర్రెగుట్టల్లో ఆరో రోజు కూంబింగ్ చేస్తుండగా ఈ సొరంగం బయటపడింది.

Also Read :Storm Control Tech: సంకల్పం గెలిచె.. పిడుగును కంట్రోల్​ చేసే టెక్నాలజీ

డీహైడ్రేషన్‌కు గురైన మావోయిస్టులు

భద్రతా బలగాలు ఆరు రోజుల క్రితం కర్రె గుట్టల్లోకి(Maoists Tunnel) ఎంటరయ్యాక.. ఈ సొరంగాన్ని మావోయిస్టులు వదిలి పారిపోయినట్లు అంచనా వేస్తున్నారు. గత వారం రోజులుగా మావోయిస్టులకు సరైన ఆహారం, నీరు అందుబాటులో లేదు. దీంతో వారు ఇప్పటికే డీహైడ్రేషన్‌కు గురై ఉంటారని భావిస్తున్నారు. ఇటువంటి స్థితిలో కర్రెగుట్టల్లో ఎక్కువ దూరం మావోయిస్టులు కంటిన్యూగా నడుస్తూ వెళ్లలేరు. ఈమేరకు అంచనాతో మావోయిస్టులను చుట్టుముట్టే వ్యూహాన్ని భద్రతా బలగాలు రెడీ చేస్తున్నాయి. హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా అడవుల్లో మావోయిస్టుల జాడను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. మావోయిస్టుల్లోని గూఢచారులు అందిస్తున్న సమాచారాన్ని వాడుకొని ట్రాకింగ్ మొదలుపెట్టారు.

Also Read :130 Nukes Warning: భారత్‌పై దాడికి 130 అణు బాంబులు: పాక్‌ మంత్రి

ముగ్గురు మహిళా మావోయిస్టులను.. 

గత ఆరు రోజులుగా కర్రెగుట్టల్లో నిర్వహిస్తున్న ఆపరేషన్‌లో ముగ్గురు మహిళా మావోయిస్టులను తెలంగాణ పరిధిలో ఎన్‌కౌంటర్ చేశారు.  వారి  మృతదేహాలను, ఆయుధాలను, పెద్దఎత్తున పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం రోజు కూడా భారీ సంఖ్యలో మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకొని ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి, భీమారంపాడు, కస్తూరిపాడు, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, పూజారికాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్గంలో భద్రతా బలగాల ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం వైపున ఉన్న కర్రెగుట్టల్లో దాదాపు 24 మందికిపైగా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

Also Read :Indiramma Housing Scheme : గజం పెరిగిన ఇందిరమ్మ సాయం అందదు – తెలంగాణ సర్కార్ హెచ్చరిక


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chhattisgarh
  • Chhattisgarh-Telangana border
  • Karreguttalu
  • maoists
  • Maoists Tunnel
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd