HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Huge Joinings In Telangana Congress

Telangana Congress : కాంగ్రెస్ లో వ‌రుస చేరిక‌లు.. ఆయా జిల్లాలో నేత‌లు క‌లిసి ప‌ని చేసేనా..?

క‌ర్ణాట‌కలో కాంగ్రెస్ గెలుపు త‌రువాత తెలంగాణ‌లో అధికారంపై క‌న్నేసింది. ఎలాగైన తెలంగాణ‌లో గెలుపు రుచి చూడాలిని

  • Author : Prasad Date : 18-07-2023 - 12:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress Hashtag
Congress Hashtag

క‌ర్ణాట‌కలో కాంగ్రెస్ గెలుపు త‌రువాత తెలంగాణ‌లో అధికారంపై క‌న్నేసింది. ఎలాగైన తెలంగాణ‌లో గెలుపు రుచి చూడాలిని కాంగ్రెస్ భావిస్తుంది. దీంతో క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించిన నేత‌లు ఎలాంటి వారైనా స‌రే క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకునేందుకు వెన‌కాడ‌టం లేదు. మ‌రోవైపు ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ కు క్యూ కడుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇతర పార్టీల్లోని పలువురు కాంగ్రెస్ తో టచ్ లోకి వస్తున్నారు. కొత్తగా చేరుతున్న వారికి సీట్ల పైన హామీలు దక్కుతున్నాయి. ఇది పార్టీనే నమ్ముకొని అంకితభావంతో ఉన్న నేతల్లో పలు సందేహాలకు కారణమవుతోంది. ఇంత కాలం తమను ఇబ్బంది పెట్టిన నేతలు ఇప్పుడు తమ పార్టీలోకి రావటం పైన పలు చోట్ల సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వీరిని పార్టీ ఎలా సమన్వయం చేస్తుంది? సీట్ల విషయంలో అనుసరించే ఫార్ములా ఏంటి? ఎవరికి ప్రాధాన్యత దక్కుతుంది? ఇవ్వలేని వారికి ఎలా న్యాయం చేస్తుంది? ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రధాన చర్చగా మారింది.

కాంగ్రెస్ లో చేరికల ప్రవాహం పెరిగింది. కాంగ్రెస్ కే అధికారం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ప్రజలు సైతం కాంగ్రెస్ కే మద్దతుగా నిలుస్తారనేది క్షేత్ర స్థాయి ఫీడ్ బ్యాక్. దీంతో పార్టీలోకి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ ముఖ్య నేతలతో మంతనాలు జోరుగా సాగుతున్నాయి. అందరూ కాంగ్రెస్ సీటు కావాలనే షరతు పెడుతున్నారు. పార్టీలో చేరికలను ప్రోత్సహించి ప్రత్యర్ధి పార్టీలను దెబ్బ తీయాలని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం వచ్చే వారికి హామీలు గుప్పిస్తుంది. కొత్త వారు చేరికలు అవసరమే అయినా..పాత వారికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారుతోంది. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న సమయంలో పని చేసిన వారు తమ నియోజకవర్గాల్లో సీట్లపైన ఆశలు పెట్టుకున్నారు. ఆ నియోజకవర్గాల్లో కొత్త నేతలను చేర్చుకునే క్రమంలో సీట్ల హామీలు ఇస్తుండటం వారికి రుచించటం లేదు. దీంత పార్టీకి ఈ వ్యవహారం సమస్యగా మారుతోంది.

ఉమ్మడి మహబూబ్ నగరంలోని కొల్లాపూర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో చేరికలపైన నాగం జనార్ధనరెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దామోదర్ రెడ్డి తన కుమారుడికి సీటు పైన హామీ కోరారు. అదే విధంగా రంగారెడ్డి జిల్లాలో మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికకు సిద్దమయ్యారని తెలుస్తుంది. తన వర్గానికి సీట్లపైన హామీ దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం జిల్లాలోని పార్టీ నేతలకు అంతుచిక్కటం లేదు. ఖమ్మం జిల్లాలో పాత, కొత్త నేతల మధ్య సీట్ల కోసం పోటీ నెలకొని ఉంది. పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం తిరిగి పార్టీలో చేరటమే కాక సీటు పైన కూడా ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో సీతక్క కుమారుడు అక్కడ చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ సమయంలో వారికి ఇస్తున్న హామీలతో పార్టీనే నమ్ముకున్న నేతల్లో ఆందోళన కనిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aicc
  • bjp
  • brs
  • congress
  • telangana
  • tpcc

Related News

Kavitha

KCR సభపై కవిత దారుణమైన కామెంట్స్

జగిత్యాల వేదికగా జరిగిన సభలో కేసీఆర్ ప్రసంగాన్ని ఉద్దేశించి కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, నిరుద్యోగం వంటి అనేక జ్వలంత సమస్యలు ఉన్నప్పటికీ, అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను

  • Jeevan Reddy Brs

    BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • Harish Rao Kmm

    Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

  • Pig Gives Birth To Elephant

    పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

  • Twins Same Marks in Intermediate Results 2026

    ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

Latest News

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

  • Ultratech : పారిశ్రామిక చరిత్రలో సరికొత్త రికార్డు సాధించిన అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్

  • Eruditus Open House Series 2026 : విదేశీ విశ్వవిద్యాలయాలకు హైదరాబాద్ అడ్డా

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd