MLAs Defection Case : నేడు ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ..!
ఈరోజు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు విచారణ చేయనుంది. మరి ఇవాళ విచారణలో ఎలాంటి తీర్పు సుప్రీం కోర్టు ఇస్తుందో చూడాలి. మరోవైపు ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు తామేం పార్టీ ఫిరాయించలేదంటూ అఫిడవిట్లలో పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 11:39 AM, Tue - 25 March 25

MLAs Defection Case : నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు విచారణకు రానుంది. గత విచారణ సందర్భంగా స్పీకర్‌తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు అందించింది. 10 నెలలు దాటినా ఎందుకు పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడం లేదని స్పీకర్ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని గత విచారణలో స్పీకర్ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Read Also: Collectors Conference : నేడు, రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్స్ కాన్ఫరెన్స్
ఇక, ఈరోజు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు విచారణ చేయనుంది. మరి ఇవాళ విచారణలో ఎలాంటి తీర్పు సుప్రీం కోర్టు ఇస్తుందో చూడాలి. మరోవైపు ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు తామేం పార్టీ ఫిరాయించలేదంటూ అఫిడవిట్లలో పేర్కొన్నారు. తాజాగా.. పిటిషనర్లను తప్పుబడుతూ స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేశారు. రీజనబుల్ టైం అంటే గరిష్టంగా మూడు నెలలే అని అర్థం కాదు. ఒక్కో కేసు విచారణకు ఒక్కో రకమైన సమయం అవసరం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. కానీ, స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే కోర్టుకు వెళ్లారు. స్పీకర్ ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న తర్వాతే.. న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు.
కాగా, బీఆర్‌ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌లపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు అయ్యింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలైంది. వీటిపై ఇప్పటికే పలుమార్లు సుప్రీం కోర్టు విచారణ జరిపింది. కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఇతర బీఆర్‌ఎస్ నేతలు ఈ పిటిషన్లు వేశారు.
Read Also:Spirtual: అరచేయి దురద పెడితే నిజంగానే డబ్బులు వస్తాయా.. పండితులు ఏం చెబుతున్నారంటే?