Spirtual: అరచేయి దురద పెడితే నిజంగానే డబ్బులు వస్తాయా.. పండితులు ఏం చెబుతున్నారంటే?
చాలామంది అరచేయి దురద పెడితే డబ్బులు వస్తుంది అదృష్టం కలిసి రాబోతోంది అని అంటారు. మరి నిజంగానే అరచేయి దురద పెడితే డబ్బులు కలిసి వస్తుందా ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 25-03-2025 - 11:24 IST
Published By : Hashtagu Telugu Desk
హిందూమతంలో శకునాల శాస్త్రం చాలా ముఖ్యమైనది అన్న విషయం మనందరికీ తెలిసిందే. చాలా విషయాలలో శకునాలు పాటిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా శరీరానికి సంబంధించిన అనేక అశుభ, శుభ శకునాలను కూడా ఫాలో అవుతూ ఉంటారు. కళ్ళు అదరడం, పెదవులు అదరడం, కంటి రెప్పలు కొట్టుకోవడం ఇలాంటి శకునాలను పాటిస్తూ ఉంటారు. వీటిలో అరచేతిలో దురద పెట్టడం అన్నది కూడా ఒకటి. కొంతమందికి అకస్మాత్తుగా అరచేతిలో దురద అనిపిస్తూ ఉంటుందట.
అరచేతిలో దురద శుభప్రదమా లేదా అశుభప్రదమా, అది ఏ అరచేతి దురదగా ఉందో, అది పురుషుడిదా లేదా స్త్రీదా అనే దానిపై ఆధారపడి ఉంటుందని పండితులు చెబుతున్నారు. కాగా పురుషుల కుడి అరచేతిలో దురదగా అనిపిస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు. పురుషుల ఎడమ అరచేతిలో దురదను అశుభంగా భావిస్తారట. స్త్రీల ఎడమ అరచేతిలో దురద శుభప్రదంగా పరిగణించబడుతుందట. అదే సమయంలో స్త్రీల కుడి అరచేతిలో దురదను అశుభంగా భావిస్తారట.
మహిళలకు కుడి చేతిలో దురద దురదృష్టానికి సంకేతంగా చెబుతున్నారు. కుడి చేతిలో దురద అంటే మీరు ఆర్థిక నష్టాన్ని చవిచూడవచ్చట. అనవసరమైన వస్తువులకు డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చని చెబుతున్నారు. అదే ఎడమ అరచేతిలో దురద అంటే మీరు డబ్బుకు సంబంధించిన కొన్ని శుభవార్తలను అందుకుంటారట. కొంత అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు. కాబట్టి అరచేయి దురద పెట్టడం అన్నది డబ్బుకు సంకేతంగానే భావించాలని పండితులు చెబుతున్నారు.