HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Health Atms In Government Hospitals 130 Types Of Tests Reports In Minutes

ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్త్ ఏటీఎంలు.. 130 రకాల పరీక్షలు.. నిమిషాల్లోనే రిపోర్టులు

  • Author : Vamsi Chowdary Korata Date : 13-04-2026 - 12:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Health Atms
Telangana Health Atms

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కోసం గంటల తరబడి నిరీక్షించే అవస్థలకు, రిపోర్టుల కోసం రోజుల తరబడి ఎదురుచూసే ఇబ్బందులకు ముగింపు పలికేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. వైద్యారోగ్య శాఖను బలోపేతం చేయడంలో భాగంగా పేద రోగులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా “హెల్త్ ఏటీఎం”లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏటీఎంల ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలోనే దాదాపు 130 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు.

ఈ వినూత్న కార్యక్రమాన్ని ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లోని కింగ్ కోఠి, మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించారు. అక్కడ ఈ యంత్రాలు అద్భుతమైన ఫలితాలను ఇవ్వడంతో అధికారులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. హెల్త్ ఏటీఎంల ద్వారా వచ్చిన పరీక్ష ఫలితాలను, టీ-డయాగ్నోస్టిక్స్, ప్రముఖ ప్రైవేట్ ల్యాబ్‌ల రిపోర్టులతో పోల్చి చూడగా, ఫలితాల్లో కచ్చితత్వం ఉండటంతో ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పేద, సామాన్య ప్రజలకు వేల రూపాయలు ఖర్చయ్యే కీలక వైద్య పరీక్షలు ఇకపై సులభంగా, వేగంగా అందనున్నాయి.

క్లౌడ్ ఆధారిత టెక్నాలజీతో పనిచేసే ఈ హెల్త్ ఏటీఎంల ద్వారా బీపీ, ఈసీజీ, శరీరంలోని కొవ్వు శాతం, ఆక్సిజన్ స్థాయులు, ఉష్ణోగ్రత వంటి 65 రకాల ప్రాథమిక పరీక్షలను నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. వీటితో పాటు రక్త నమూనాల ద్వారా గ్లూకోజ్, హిమోగ్లోబిన్, లిపిడ్ ప్రొఫైల్, కాలేయం, కిడ్నీ పనితీరు, థైరాయిడ్ వంటి కీలక పరీక్షలు కూడా నిర్వహిస్తారు. అంతేగాక‌ గర్భిణుల కోసం ఫీటల్ డాప్లర్, చర్మ వ్యాధుల నిర్ధారణకు డెర్మాస్కోప్ వంటి ప్రత్యేక సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ వ్యవస్థను మరింత పారదర్శకంగా, రోగికి సౌకర్యవంతంగా మార్చేందుకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA)తో అనుసంధానించారు. దీనివల్ల రోగి చేయించుకున్న ప్రతి పరీక్ష రిపోర్ట్ డిజిటల్ రూపంలో వారి అభా కార్డులో భద్రంగా ఉంటుంది. పరీక్ష పూర్తయిన వెంటనే రిపోర్టులు నేరుగా రోగి మొబైల్ ఫోన్‌కు వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా చేరతాయి. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేని గ్రామీణ ప్రజలకు సహాయపడేందుకు ప్రతి ఏటీఎం వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నారు.

అయితే, ఒక రోగికి అన్ని పరీక్షలు పూర్తి చేయడానికి దాదాపు 45 నిమిషాల నుంచి గంట సమయం పడుతుండటం పైలట్ ప్రాజెక్టులో ఒక సవాలుగా నిలిచింది. ఈ సమస్యను అధిగమించడానికి, రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన ఆసుపత్రుల్లో రెండు లేదా మూడు హెల్త్ ఏటీఎం యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. త్వరలోనే ఈ సదుపాయాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు విస్తరించేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ayushman Bharat Health
  • free medical tests
  • King Koti Hospital
  • Malakpet Hospital
  • Medical Tests
  • Telangana Government Hospitals
  • Telangana Health ATMs

Related News

    Latest News

    • RK Roja : రోజా ‘మకాం’ మార్చబోతుందా ?

    • Amaravati : భారత్ గ్లోబల్ డీప్‌టెక్ పవర్‌హౌస్‌గా అమరావతి

    • Holiday: రేపు బ్యాంకులకు సెలవు

    • ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్త్ ఏటీఎంలు.. 130 రకాల పరీక్షలు.. నిమిషాల్లోనే రిపోర్టులు

    • CBN : “చరిత్రలో బాబు గొప్ప సీఎం ” – కేటీఆర్ సంచలన వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఇదేనా?

    Trending News

      • శాంతి చ‌ర్చ‌లు విఫ‌లం.. కార‌ణం నెత‌న్యాహు ఫోన్ కాల్‌?!

      • హోర్ముజ్ జలసంధి క్లియరెన్స్‌కు అమెరికా వ్యూహం!

      • KKR అభిమానులకు గుడ్ న్యూస్.. రూ. 18 కోట్లు పెట్టి కొన్న స్టార్ బౌలర్ ఫిట్!

      • 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 78 వేల సబ్సిడీ.. ఏంటి ఈ ప్రభుత్వ పథకం?

      • చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd