HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Harish Rao Is Angry Over Non Payment Of Commission To Ration Dealers

Harish Rao: రేషన్ డీలర్ల కమీషన్ చెల్లించ‌క‌పోవ‌డంపై హరీశ్ రావు ఆగ్రహం!

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించినట్లు హరీశ్ రావు గుర్తు చేశారు. 2014లో మెట్రిక్ టన్నుకు రూ. 200 ఉన్న కమీషన్‌ను రూ. 1,400కి పెంచామని, దీనివల్ల ప్రభుత్వంపై రూ. 139 కోట్ల అదనపు భారం పడినా డీలర్ల సంక్షేమం కోసం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

  • By Gopichand Published Date - 12:52 PM, Tue - 23 September 25
  • daily-hunt
Harish Rao
Harish Rao

Harish Rao: రేషన్ డీలర్లకు కమీషన్లు చెల్లించకపోవడంపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా ఖండించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రేషన్ డీలర్లు ఆయన్ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వాల నిరక్ష్య వైఖరి రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాన అంశాలు

పేదలకు ఆహారం పంపిణీ చేస్తున్న డీలర్లు కమీషన్లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది దుర్మార్గమని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల తీరు కారణంగా డీలర్లు పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన రూ. 5,000 గౌరవ వేతనం, కమీషన్ పెంపు హామీని ఇప్పటికీ నెరవేర్చలేదని, ఇది ‘మాటలు తప్ప చేతలు లేని కోతల ప్రభుత్వం’ అని విమర్శించారు.

Also Read: Hanuman Idol Controversy in USA: టెక్సాస్‌లో హనుమాన్ విగ్రహంపై సెనేటర్ తీవ్ర విమర్శలు

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించినట్లు హరీశ్ రావు గుర్తు చేశారు. 2014లో మెట్రిక్ టన్నుకు రూ. 200 ఉన్న కమీషన్‌ను రూ. 1,400కి పెంచామని, దీనివల్ల ప్రభుత్వంపై రూ. 139 కోట్ల అదనపు భారం పడినా డీలర్ల సంక్షేమం కోసం కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా, కరోనా సమయంలో మరణించిన 100 మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకాల కింద డీలర్‌షిప్ మంజూరు చేశామని, డీలర్‌షిప్ వయోపరిమితిని 40 నుంచి 50 ఏళ్లకు పెంచామని ఆయన వివరించారు.

ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ కమీషన్, సెప్టెంబర్ కమీషన్‌ను వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు రూ. 5,000 గౌరవ వేతనం, కమీషన్ పెంపును వెంటనే ప్రకటించాలని ఆయన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గ వైఖరి రేషన్ డీలర్ల పండుగలను దూరం చేస్తోందని ఆయన విమర్శించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Congress Govt
  • harish rao
  • hyderabad news
  • Ration Leaders
  • telangana
  • telugu news

Related News

CM Revanth

CM Revanth: మేడారం అభివృద్ధి మనందరి భాగ్యం, 18 సార్లు అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకున్నాను: సీఎం రేవంత్

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశారు. "కుంభమేళాకు వేల కోట్లు ఇచ్చినట్లుగా మేడారం జాతరకూ నిధులు ఇవ్వాలి.

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: మేడారం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

  • Minister Nara Lokesh

    Minister Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవతో నెరవేరిన చిన్నారి జెస్సీ కల!

  • Bathukamma

    Bathukamma Celebrations : విషాదం నింపిన బతుకమ్మ

  • Elections

    Elections: మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు?

Latest News

  • Dulquer Salmaan: స్మగ్లింగ్ ఆరోపణలు.. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాలపై దాడులు!

  • Medaram: అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

  • Yuvraj Singh : ED విచారణకు హాజరైన యువరాజ్ సింగ్

  • Fees of Private Schools : ప్రైవేట్ పాఠశాలల ఫీజు నియంత్రణ పై లోకేష్ క్లారిటీ

  • H1B Visa: H-1B వీసా ఫీజులో వారికీ మినహాయింపు..?

Trending News

    • GST 2.0: ఇక‌పై అత్యంత త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే వ‌స్తువులీవే!

    • Kantara Chapter 1 Trailer: కాంతారా చాప్ట‌ర్-1 ట్రైల‌ర్ విడుద‌ల‌.. అద‌ర‌గొట్టిన రిషబ్‌ శెట్టి!

    • Dussehra: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దసరా అలంకారాల వైభవం 11 రోజులు

    • EPFO 3.0: దీపావ‌ళికి ముందే శుభ‌వార్త‌.. పీఎఫ్ ఉపసంహరణ ఇక సులభతరం!

    • Mirai Collections: ప్రభాస్, ఎన్టీఆర్ తర్వాత అదే రికార్డ్ తేజ సజ్జా ఖాతాలో! ‘మిరాయ్’ కలెక్షన్ల హవా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd