Group 2 Exams : తెలంగాణలో రేపు, ఎల్లుండి గ్రూప్-2 పరీక్షలు
ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున నాలుగు పేపర్లు 600 మార్కులకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. కాగా, మార్చి చివరి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేస్తామని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు.
- By Latha Suma Published Date - 01:09 PM, Sat - 14 December 24

Group 2 Exams : తెలంగాణలో రేపు, ఎల్లుండి గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. OMR పద్ధతిలో 1,368 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10-12.30, మధ్యాహ్నం 3- 5.30గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. 783 గ్రూప్-2 సర్వీసుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 5,51,943 మంది అప్లై చేసుకున్నారు. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున నాలుగు పేపర్లు 600 మార్కులకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. కాగా, మార్చి చివరి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేస్తామని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. గ్రూప్ 2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేశామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. గ్రూప్ 2 పరీక్ష ఎమోషనల్ అటాచ్‌మెంట్ అయిందని చెప్పారు. ఇప్పటికే నాలుగుసార్లు గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడిందని అన్నారు.
వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లను తెలంగాణ సర్వీస్ కమిషన్ ను సందర్శించాలని అనుకుంటున్నాయి. నియామక ప్రక్రియ ఏదైనా గరిష్టంగా ఒక సంవత్సరం లోపే పూర్తి చేయాలని ప్లాన్ అన్నారు. ఈ మేరకు 18, 19 తేదీల్లో సర్వీస్ కమిషన్ ఢిల్లీకి పర్యటన చేస్తామని, జాతీయ స్థాయి రిక్రూట్ మెంట్ ఏజెన్సీ లను కలుస్తామని తెలిపారు. 18 న యూపీఎస్సీ కి వెళతామని.. ఆ తరవాత చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ను కలుస్తామన్నారు. 19 న స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఛైర్మన్ ను, ఆ రోజు సాయంత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ను కలుస్తామని, జనవరి చివరి నాటికి ప్రభుత్వానికి మా యాక్షన్ ప్లాన్ ఇస్తామని వెల్లడించారు.
కాగా, అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు తమ వెంట బ్లూ/బ్లాక్ పాయింట్ పెన్నులు, ఫొటోతో కూడిన హాల్‌టికెట్, ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఫొటో ఐడీ కార్డు తీసుకురావాల్సి ఉంటుందని అన్నారు.పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు క్యాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్, పెన్‌డ్రైవ్, బ్లూ టూత్ డివైసెస్, జువెల్లరీ, ఎలక్ర్టానిక్ గాడ్జెట్ తదితర సామగ్రి అనుమతించరు. చెప్పులు మాత్రమే వేసుకుని రావాలని, షూస్ వేసుకోవద్దని టీజీపీఎస్సీ సూచించింది. హాల్‌టికెట్‌పై పాస్‌పోర్టు సైజ్ ఫొటో ముద్రించి తీసుకెళ్లాలి. ఒకే హాల్‌టికెట్‌ను పరీక్ష మొత్తం వినియోగించాల్సి ఉంటుంది. హాల్‌టికెట్‌లో ఫొటో సరిగా లేకపోతే అభ్యర్థి మూడు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు గెజిటెడ్ అధికారి లేదా చివర చదివిన విద్యాసంస్థ ప్రిన్సిపాల్ సంతకంతో తీసుకువచ్చి పరీక్షాహాల్‌లో ఇన్విజిలేటర్‌కు అప్పగించాల్సి ఉంటుంది.