Gold Price Today : రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు..!
Gold Price Today : పసిడి ప్రియులకు ధరలు చూస్తే చుక్కలు కనిపిస్తున్నాయి. రోజు రోజుకూ భారీగా పెరుగుతున్నాయి. గత రెండు రోజుల్లో భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు ఇవాళ శాంతించాయి. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో జనవరి 31వ తేదీన తులం రేటు ఎంతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- By Kavya Krishna Published Date - 09:37 AM, Fri - 31 January 25

Gold Price Today : భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో బంగారం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. పండుగలు, శుభకార్యాలు బంగారం లేకుండా పూర్తికావు. ముఖ్యంగా భారతీయ మహిళలు బంగారు ఆభరణాలను ఎక్కువగా ఇష్టపడతారు. ఇక ఇటీవల పురుషులు కూడా బంగారం ధరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో దేశంలో బంగారం దిగుమతులు పెరుగుతుండగా, ప్రత్యేక రోజులు కాకుండా సాధారణ రోజుల్లోనూ బంగారం కొనుగోలు గణనీయంగా జరుగుతోంది.
బంగారం ధరలు అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, అగ్రదేశాల నిర్ణయాలు, భౌగోళిక పరిస్థితులు, మార్కెట్ డిమాండ్ వంటి అంశాల ప్రభావంతో నిరంతరం మారుతుంటాయి. ఇటీవల బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుని ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 31న హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Telangana Assembly : ఫిబ్రవరి 7న శాసనసభ ప్రత్యేక సమావేశం..!
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు
ప్రపంచ మార్కెట్లో బంగారం రేట్లు పెరుగుతూ రికార్డుల స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $2,797 వద్ద ట్రేడవుతోంది. అలాగే, స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు $31.57 వద్ద ఉంది. భారతీయ కరెన్సీ విలువ కూడా బలహీనంగా కొనసాగుతోంది. ప్రస్తుతం డాలర్‌తో మారకం విలువ ₹86.633 వద్ద ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరుగుతూ వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గడిచిన రెండు రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర ₹1,000 మేర పెరిగింది. అయితే, ఇవాళ ఈ ధర స్థిరంగా ఉంది.
22 క్యారెట్ల బంగారం ధర – 10 గ్రాములకు ₹76,110
24 క్యారెట్ల మేలిమి బంగారం ధర – 10 గ్రాములకు ₹83,020
హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర
హైదరాబాద్ మార్కెట్లో వెండి ధరలు కూడా పెరుగుతూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. గత రోజుతో పోలిస్తే ఇవాళ కిలో వెండి ₹100 పెరిగింది.
1 కిలో వెండి ధర – ₹1,06,100
(గమనిక: ఈ రేట్లు జనవరి 31, ఉదయం 7 గంటల సమయానికి నమోదైనవి. మధ్యాహ్నానికి మార్కెట్ పరిస్థితుల వల్ల బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉండొచ్చు. అంతే కాకుండా, ప్రాంతానుసారంగా కూడా రేట్లలో తేడాలు వస్తాయి. అందువల్ల కొనుగోలు చేసేందుకు ముందుగా తాజా ధరలను తెలుసుకోవడం ఉత్తమం.)
RCB: ఆర్సీబీకి కష్టాలు తప్పవా.. ఓపెనింగ్ జోడీపై ఉత్కంఠ