Amrapali : జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి హైకోర్టు నోటీసులు!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాస ప్రాంతాల్లోని కొండరాళ్లను తొలగించేందుకు కొందరు రాత్రింబవళ్లు పేలుళ్లు నిర్వహిస్తున్నారు.దీనికి సంబంధించి పలు వార్త కథనాలు రావడంతో జడ్జి నగేశ్ భీమపాక హైకోర్టు సీజేకు లేఖ రాశారు.
- Author : Latha Suma
Date : 04-09-2024 - 2:49 IST
Published By : Hashtagu Telugu Desk
Amrapali : తెలంగాణ హైకోర్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి నోటీసులు జారీ చేసింది. ఆమెతో పాటు భూగర్భగనులు, పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శులకు కూడా నోటీసులు అందజేసింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాస ప్రాంతాల్లోని కొండరాళ్లను తొలగించేందుకు కొందరు రాత్రింబవళ్లు పేలుళ్లు నిర్వహిస్తున్నారు.దీనికి సంబంధించి పలు వార్త కథనాలు రావడంతో జడ్జి నగేశ్ భీమపాక హైకోర్టు సీజేకు లేఖ రాశారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పేలుళ్లు నిర్వహిస్తుండటంతో సమీప ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
దీనిని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు బుధవారం భూగర్భగనులు, పర్యావరణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ప్రతివాదులుగా చేర్చింది.పేలుళ్లపై వీలైనంత త్వరగా వివరణ ఇవ్వాలని హైకోర్టు పంపిన నోటీసుల్లో పేర్కొంది. కాగా, జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలి ఈ మధ్యనే పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
రాత్రిపూట పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయని, దీనివల్ల సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాశారు. ఈ లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వాజ్యంగా స్వీకరించింది. బుధవారం ఈ పిల్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. భూగర్భ గణులు, పర్యావరణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు, హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంజీ కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చింది. పేలుళ్లపై వివరణ ఇవ్వాలని ఐఏఎస్ ఆమ్రపాలితో పాటు వారికి కూడా నోటీసులు ఇచ్చింది.