Narayana Murthy : మీలా కావాలంటే ఏం చేయాలన్న విద్యార్థి.. నారాయణమూర్తి సూపర్ ఆన్సర్
‘‘నువ్వు నాలాగా కావాలని నేనైతే కోరుకోను. నాకంటే నువ్వు మరింతగా ఎదగాలి. చాలా పెద్దస్థానాలకు నువ్వు చేరుకోవాలి.
- By Pasha Published Date - 02:35 PM, Wed - 4 September 24
Narayana Murthy : ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మీలా కావాలంటే ఏం చేయాలి ?’’ అని పన్నెండేళ్ల విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. ‘‘నువ్వు నాలాగా కావాలని నేనైతే కోరుకోను. నాకంటే నువ్వు మరింతగా ఎదగాలి. చాలా పెద్దస్థానాలకు నువ్వు చేరుకోవాలి. ఒకరి అడుగుజాడల్లో నడవడం మాత్రమే సరిపోదు. మనకంటూ ఓ కొత్త మార్గాన్ని వేసుకోవాలి. మన దేశం కోసం మనమంతా ఉన్నతంగా తయారుకావాలి’’ అని నారాయణమూర్తి ఆ విద్యార్థికి సూచించారు. ఇటీవలే టీచ్ ఫర్ ఇండియా లీడర్స్ వీక్ కార్యక్రమంలో నారాయణమూర్తి పాల్గొన్నారు. ఈసందర్భంగానే ఆయనను సదరు విద్యార్థి ప్రశ్న అడిగాడు.
We’re now on WhatsApp. Click to Join
‘‘నేను విద్యార్థిగా ఉన్నప్పుడు టైమ్ టేబుల్ వేసుకొని పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలో మానాన్న నేర్పించారు. దానివల్లే నేను చాలా పరీక్షల్లో టాప్ ర్యాంకులు పొందాను. విద్యార్థి దశలో క్రమశిక్షణతో ఉంటే అదే జీవితాంతం అలవాటుగా మారిపోతుంది. నిరంతరం ఏదోఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉంటే తప్పకుండా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు’’ అని నారాయణమూర్తి(Narayana Murthy) ఆ విద్యార్థికి తెలిపారు.‘‘నేను ఇంజినీర్ అయిన తొలినాళ్లలో ఓ కంపెనీ టీమ్‌లో సభ్యుడిగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌కు వెళ్లాను. మా టీమ్ ఓ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తుండగా మొత్తం కంప్యూటర్ సిస్టమ్ మెమరీ పోయింది. దాన్ని పునరుద్ధరించడానికి ఆ టైంలో మా కంపెనీ బాస్ కోలిన్ నాతో కలిసి 22 గంటలు పని చేశారు. కానీ నన్ను తక్కువ చేసి మాట్లాడలేదు. ఒక బాస్‌గా ఆ పరిస్థితికి కోలిన్ పూర్తి బాధ్యత తీసుకున్నారు. విద్యార్థులు అదేవిధంగా నాయకత్వ లక్షణాలతో ముందుకువెళ్లాలి. మన వైఫల్యాలకు మనమే పూర్తి బాధ్యత వహించాలి’’ అని నారాయణమూర్తి సూచించారు.
Also Read :30 Officials Executed : 30 మంది అధికారులను ఉరితీసిన కిమ్.. ఎందుకో తెలుసా ?
‘‘ఇతరులకు ఏదైనా ఇవ్వడంలో చాలా ఆనందం ఉంటుందని మా అమ్మ నాతో చెప్పేది. అవసరంలో ఉన్నవారికి తగిన సమయంలో మనం అందించే సహాయం మనలోని మానవతాదృక్పథాన్ని తెలియజేస్తుంది’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమం వేదికగా విద్యార్థులకు నారాయణమూర్తి గైడెన్స్ అందించారు.
Also Read :Vinesh Phogat : కాంగ్రెస్‌లో చేరిన వినేష్ ఫోగట్, బజ్రంగ్ పునియా
Tags
Related News
1000 Joining Letters : ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్.. రెండేళ్ల క్రితం ఎంపికైన ఫ్రెషర్లకు జాబ్ ఆఫర్స్
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారంతా త్వరలోనే ఓ జాబ్(1000 Joining Letters) వాళ్లు కాబోతున్నారు.