HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Gender Determination Tests In The Car Gang In Khammam New Update

Gender Determination: కారులోనే లింగ నిర్ధారణ టెస్టులు.. ముఠా ఆటకట్టు

నలుగురు గర్భిణులను(Gender Determination)టెస్ట్‌ చేసేందుకు కొరుమూరులోని మనోజ్‌ ఇంటికి తీసుకొచ్చారని పోలీసులకు సమాచారం అందింది.

  • Author : Pasha Date : 01-03-2025 - 4:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gender Determination Tests Gender Predictor Tests Khammam

Gender Determination: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం అనేది చట్టవిరుద్ధం. పుట్టబోయేది అబ్బాయా ? అమ్మాయా ? అనేది ముందుగా టెస్ట్ చేసి తెలుసుకోవడం, చెప్పడం నేరం.  అయినా ఒక ముఠా ఖమ్మం నగరం పరిసర గ్రామాల్లో గర్భిణులకు స్కానింగ్ చేస్తోంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి కారులో వెళ్లి, కారులోనే లింగ నిర్ధారణ పరీక్షలు చేసి టెస్టు రిపోర్టులను ఇస్తోంది.  ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఓ ప్రభుత్వ వైద్యుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ ముఠా ఆటను కట్టించారు.

Also Read :Akash Ambani : ముకేశ్ అంబానీ గురించి  ఆకాశ్ అంబానీ ఏం చెప్పారో తెలుసా?

ముఠా వివరాలివీ..

  • ఖమ్మం నగర శివారులోని బల్లేపల్లికి చెందిన ఆర్‌ఎంపీ చారి, ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని అల్లిపురానికి చెందిన కాత్యాయని గతంలో ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌లో కలిసి పనిచేశారు.
  • చారి, కాత్యాయని‌లు చింతకాని మండలం కొరుమూరుకి చెందిన ఆర్‌ఎంపీ మనోజ్‌తో కలిసి ఒక కారును తీసుకున్నారు. ఆల్ట్రాసౌండ్‌ స్కాన్‌ యంత్రం, ఇతర సామగ్రి కొని వాహనంలో ఫిట్ చేయించారు. ఇక ఊరూరా తిరిగి మొబైల్‌ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం మొదలుపెట్టారు.
  • ఊర్ల చివర్లలో,ఎవరూ లేని ప్రదేశాల్లో  కారులోనే ఈ పరీక్షలు చేసేవారు.
  • ఖమ్మం రూరల్‌తో పాటు ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్‌ తదితర ప్రాంతాల్లోని గ్రామాలకు వెళ్లి ఈ టెస్టులు చేసేవారు.
  • ఒక్కో టెస్టుకు రూ. 10 వేల నుంచి రూ.15 వేల వరకు తీసుకునేవారు.

Also Read :Elon Musk : ఎలాన్ మస్క్‌కు 14వ బిడ్డ.. ప్రపంచ కుబేరుడి సందేశం అదేనా?

  • ఈ వ్యవహారంపై చింతకాని మండల వైద్యాధికారి డాక్టర్‌ అల్తాఫ్‌ మొహమ్మద్‌కి అనుమానం వచ్చి ఎస్‌ఐ షేక్‌ నాగుల్‌ మీరాకు సమాచారం ఇచ్చారు.
  • నలుగురు గర్భిణులను(Gender Determination)టెస్ట్‌ చేసేందుకు కొరుమూరులోని మనోజ్‌ ఇంటికి తీసుకొచ్చారని పోలీసులకు సమాచారం అందింది. అక్కడే ఆర్‌ఎంపీ మనోజ్‌, కాత్యాయనీలను పోలీసులు అరెస్టు చేశారు.
  • ప్రధాన నిందితుడు చారి పరారయ్యాడు.
  • ఈ ముఠాను ఇన్నాళ్లుగా వైద్యాధికారులు కానీ, పోలీసులు కానీ ఎందుకు గుర్తించలేకపోయారనే ప్రశ్న ఉదయిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • Gender Determination
  • Gender Determination Tests
  • Gender Predictor Tests
  • khammam

Related News

Accident

Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. తల్లాడ మండలం రామానుజవరం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి ఎడమవైపు ఉన్న బారికేడును ఢీకొట్టింది. అనంతరం కారు పల్ట

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Kavitha

    Kavitha : వెలుగుమట్ల, ట్రిపుల్ ఆర్ బాధితులతో గవర్నర్‌ను కలిసిన టీఆర్ఎస్ అధ్య‌క్షురాలు కవిత

Latest News

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd