Elon Musk : ఎలాన్ మస్క్‌కు 14వ బిడ్డ.. ప్రపంచ కుబేరుడి సందేశం అదేనా?
ఎలాన్ మస్క్(Elon Musk) మొదటి భార్య పేరు జస్టిన్. ఈమె ద్వారా ఐవీఎఫ్ పద్ధతిలో ఐదుగురు పిల్లలు జన్మించారు. 2008లో జస్టిన్ నుంచి మస్క్ విడిపోయాడు.
- By Pasha Published Date - 01:43 PM, Sat - 1 March 25

Elon Musk : ఎలాన్ మస్క్.. ప్రపంచంలోనే నంబర్ 1 సంపన్నుడు. అన్ని విషయాల్లోనూ తాను వెరైటీ అని ఆయన నిరూపించుకుంటున్నారు. ఇప్పటివరకు ఎలాన్ మస్క్‌కు 13 మంది పిల్లలు ఉండగా, తాజాగా 14వ బిడ్డకు ఆయన తండ్రి అయ్యారు. మస్క్‌తో సహ జీవనం చేస్తున్న షివోన్ జిలిస్‌కు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. తాజాగా ఆమెకు పుట్టిన నాలుగో బిడ్డకు ఆర్కాడియా అని మస్క్ పేరు పెట్టుకున్నారు. ఈవివరాలను షివోన్ జిలిస్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. తమ మూడో బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ అని పేరు పెట్టుకున్నట్లు చెప్పారు. ‘‘మా మూడో, నాలుగో బిడ్డల వివరాలను అందరికీ వెల్లడించాలని నిర్ణయించుకున్నాం. ఎలాన్ మస్క్‌తో మాట్లాడిన తర్వాతే నేను ఈ ప్రకటన చేస్తున్నాను’’ అని ట్వీట్‌లో షివోన్ జిలిస్ చెప్పుకొచ్చారు. ఇక ఈ పోస్టుకు హార్ట్ సింబల్‌తో మస్క్ రిప్లై ఇచ్చారు.
Also Read :Architect Jobs : ఆర్కిటెక్ట్‌లకు మంచిరోజులు.. భారీగా శాలరీలు.. ఎందుకు ?
మస్క్ సంతానం వివరాలు
- ఎలాన్ మస్క్(Elon Musk) మొదటి భార్య పేరు జస్టిన్. ఈమె ద్వారా ఐవీఎఫ్ పద్ధతిలో ఐదుగురు పిల్లలు జన్మించారు. 2008లో జస్టిన్ నుంచి మస్క్ విడిపోయాడు.
- మస్క్ రెండో భార్య పేరు బ్రిటన్ నటి తాలులాహ్ రిలే. అయితే వారికి సంతానం లేదు.
- మస్క్ మూడో భార్య పేరు గ్రిమ్స్. ఈమె కెనడియన్ గాయని. వీరికి ముగ్గురు పిల్లలు.
- అనధికారికంగా మస్క్ నాలుగో భార్య పేరు షివోన్ జిలిస్. ఈమె ద్వారా ఇప్పుడు నాలుగో బిడ్డను మస్క్ పొందాడు.
- తన బిడ్డకు తండ్రి మస్క్ అని ఇటీవలే అమెరికా రచయిత్రి ఆష్టీ సెయింట్ క్లెయిర్ ప్రకటించారు. ఈవిషయాన్ని ఇప్పటివరకు మస్క్ ధ్రువీకరించలేదు.
Also Read :Teenmar Mallanna : కాంగ్రెస్ నుండి తీన్మార్ మల్లన్న సస్పెండ్
మస్క్ ఇస్తున్న సందేశమేంటి ?
గతంలో భారత్, అమెరికా, జపాన్, చైనా సహా చాలా దేశాలు జనాభా నియంత్రణ గురించి గొప్పగా మాట్లాడాయి. నీతులు చెప్పాయి. జనాభా నియంత్రణను తప్పుపట్టే పలు మతాల విధానాలను, ఆనాడు ఎంతోమంది నిందించారు. కట్ చేస్తే.. ఇప్పుడు జనాభా నియంత్రణ విధానాలను పాటించేందుకు ఆ దేశాలు ససేమిరా అంటున్నాయి. ఎక్కువ మంది పిల్లల్ని కనేవారికి జపాన్, చైనా లాంటి దేశాలు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ప్రపంచంలోనే నంబర్1 సంపన్నుడైన ఎలాన్ మస్క్ ఏకంగా 14 మంది పిల్లలు, నలుగురు భార్యలతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. బహుభార్యత్వం చెడ్డవిషయమేం కాదనే సందేశాన్ని ఆయన ఇస్తున్నారు. పిల్లల్ని ఎక్కువగా కనడం అనేది సమాజ వ్యతిరేక చర్యేం కాదని పేర్కొంటూ గతంలో ఎక్స్‌లో మస్క్ చాలా పోస్టులే పెట్టారు.