BJP: గచ్చిబౌలి భూముల వ్యవహారం..కేంద్రానికి బీజేపీ ఎంపీల వినతి
ఇదే అంశంపై లోక్‌సభ జీరో అవర్‌లోనూ తెలంగాణ ఎంపీలు ప్రస్తావన తీసుకువచ్చారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంటు సభ్యులంతా మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసి ఈ భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
- By Latha Suma Published Date - 03:59 PM, Tue - 1 April 25

BJP : పార్లమెంట్ ఉభయసభల్లో తెలంగాణ బీజేపీ ఎంపీలు హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు ఎంపీ లక్ష్మణ్ రాజ్యసభ జీరో అవర్‌లో ఈ విషయాన్ని లేవనెత్తారు. 400 ఎకరాల హెచ్‌సీయూ భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీకి కేటాయించిన భూములను మార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే అంశంపై లోక్‌సభ జీరో అవర్‌లోనూ తెలంగాణ ఎంపీలు ప్రస్తావన తీసుకువచ్చారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంటు సభ్యులంతా మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిసి ఈ భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
Along with Hon'ble MoS Shri. @bandisanjay_bjp, Hon'ble MPs Shri @Arvindharmapuri garu, Shri @Eatala_Rajender garu, Shri @KVishReddy garu, Shri @nageshgodam garu, submitted a representation on the University of Hyderabad to Hon’ble Union Minister for Education Shri @dpradhanbjp ji… pic.twitter.com/4YJMWeWBTw
— G Kishan Reddy (@kishanreddybjp) April 1, 2025
కంచె గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. పర్యావరణ, హెరిటేజ్ భూములను రక్షించాలని కోరారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కంచె గచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. తక్షణమే గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులతో ఆ ప్రాంతమంతా ఆర్త నాదాలో అల్లారుతోందన్నారు. ఈ భూములను రియల్ ఎస్టేట్ గా మార్చి వేల కోట్లు దండుకోవాలని ప్రభుత్వం చూస్తోందని బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రికి వివరించారు. హెచ్ సీయూ విద్యార్థులతోపాటు యావత్ హైదరాబాద్ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని కేంద్ర మంత్రి తెలంగాణ ఎంపీలు తెలిపారు. ఈ భేటీలో ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, నగేశ్ కూడా ఉన్నారు.
కాగా, బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ నేతలను అరెస్ట్ చేయడంపై స్పందించారు. అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. యూనివర్శిటీ భూముల దగ్గరకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడటం రేవంత్ రెడ్డికి చెల్లుతుంది. రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను మించిపోయారు. సెంట్రల్ యూనివర్శిటీ భూములపై సమగ్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. యూనివర్శిటీ భూములను అమ్ముకునే ఖర్మ ఎందుకు వచ్చింది. తక్షణమే ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. భవిష్యత్ లో తెలంగాణను తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డి ఇటలీ పారిపోయేలా ఉన్నారు. ఇది ప్రజా పాలననా..? నియతృత్వ పాలననా..? మూసీ, ఫార్మా, భూములు తాకట్టు పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది అని బీజేపీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
Read Also: Tollywood : నా సినిమాలను బ్యాన్ చేయండి – నిర్మాత నాగవంశీ