HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Exams Postponed At Ku Satavahana Universities

Heavy rains : కాకతీయ, శాతవాహన వర్సిటీల్లో పరీక్షలు వాయిదా

ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ కట్ల ఒక ప్రకటనలో వెల్లడించారు. వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల సురక్షతకే ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లడంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

  • Author : Latha Suma Date : 28-08-2025 - 10:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Exams postponed at Kakatiya and Satavahana universities
Exams postponed at Kakatiya and Satavahana universities

Heavy rains : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు విద్యా సంస్థలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఈనెల 28, 29 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ మరియు పీజీ కోర్సుల పరీక్షలను యూనివర్శిటీ అధికారులు తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ కట్ల ఒక ప్రకటనలో వెల్లడించారు. వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల సురక్షతకే ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లడంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వాయిదా వేసిన పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ నిర్ణయం కేవలం రెండు రోజుల పరీక్షలకే వర్తించుతుందని, మిగతా తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలు యథాప్రకారం జరిగేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

Read Also: America : టారిఫ్ ఎఫెక్ట్ ..ఎగుమతులపై తీవ్ర ప్రభావం, కేంద్రం ప్రత్యామ్నాయ వ్యూహం

ఇక, శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోనూ వర్షాలు అల్లకల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో, నేడు జరగాల్సిన బీఎడ్‌, ఎంఎడ్‌ కోర్సుల పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. యూనివర్శిటీ అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. విద్యార్థుల ప్రయాణ భద్రత దృష్ట్యా తాత్కాలికంగా ఈ చర్య తీసుకున్నామని వారు తెలిపారు. అయితే, శాతవాహన యూనివర్శితి కూడా మిగిలిన అన్ని పరీక్షలు యథావిధిగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. వాయిదా వేసిన పరీక్షలు ఎప్పటికి నిర్వహించాలనే తేదీలను త్వరలో ప్రకటిస్తామని వారు తెలిపారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కరీంనగర్‌, వరంగల్‌, హన్మకొండ తదితర జిల్లాల్లో జనజీవనం పెద్ద ఎత్తున అంతరాయం కలిగింది. రహదారి వ్యవస్థ దెబ్బతినడం, పలు ప్రాంతాల్లో వరదనీరు చేరడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు ప్రయాణించడంలో అవరోధాలు ఎదురవుతున్నాయి. విద్యార్థులు సంబంధిత యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ లేదా కళాశాలల ద్వారా తాజా సమాచారం తెలుసుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షల కొత్త షెడ్యూల్ త్వరలో విడుదల కానుందని, విద్యార్థులు నిబంధనలకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని సూచించారు.

Read Also: Ganesh Chaturthi : ‘పుష్ప 2’ థీమ్‌తో గణేష్ మండపం..బన్నీ క్రేజ్ మాములుగా లేదుగా !!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Exams Postponed
  • heavy rains
  • Kakatiya
  • satavahana university
  • telangana

Related News

Rain's impact... roads turned into rivers.

Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

గురువారం ఉదయం ఢిల్లీ మరియు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)పై భారీ వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లు నీట మునిగి, భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, ఈ ప్రాంతంలోని పలు చోట్ల రోజువారీ ప్రయాణాలకు అంతరాయం కలిగింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ మరియు బులంద్‌షహర్ నుండి వచ్చిన వీడియోలు జలమయమైన పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించాయి. నీట మునిగిన వీధుల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతుండగా,

  • Heavy rains in Telangana

    Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

  • Alert for the people of AP: Heavy rain warning for these districts.

    Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

Latest News

  • INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

  • Gold Rate: పసిడి ప్రేమికులకు పండగే.. కుప్పకూలిన బంగారం ధరలు

  • Sreeleela: శ్రీలీల ఆదాయం ఎంత? ఒక నెలకు సంపాదన ఎంతంటే?

  • Businessman Missing: స్విట్జర్లాండ్ విహారయాత్రలో అదృశ్యమైన హైదరాబాద్ దంపతులు.. రూ. 50 కోట్ల కుంభకోణంలో పోలీసుల దర్యాప్తు!

  • Home Loan Rates: ఇల్లు కొనాలనుకుంటున్నారా? జూలై నెలలో హోంలోన్లపై రుణ వడ్డీ రేట్లు ఎంత ఉందంటే?

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd