Minister Ponguleti: సీఎం రేవంత్ కూడా ఏమీ అనేది లేదు.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!
గతంలో స్లాబ్ వేసి 3 సంవత్సరాల నుండి నిర్మాణం జరిగాక లబ్ధి దారులకు మంజూరు కాలేదనే విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి వాటికి వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ టవర్స్ విషయంలో పూర్తికాని వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు.
- By Gopichand Published Date - 05:06 PM, Tue - 24 December 24

Minister Ponguleti: తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు అందించే దిశగా కృషిచేస్తోంది. మంగళవారం ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) సమీక్షించారు. గత ప్రభుత్వం పదేండ్లలో హౌసింగ్ సెక్టార్‌ను నిర్లక్ష్యం చేసిందని మంత్రి పొంగులేటి విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు అని గుర్తుచేశారు. చిరకాలంగా ఉన్న పేద వాళ్ళ ఇందిరమ్మ ఇళ్ల కల నేరవేరాలన్నారు.
20 లక్షల ఇళ్లు కట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్లు మంత్రి వివరించారు. దానికి అందరం కలిసి పని చేయాలని తెలిపారు. అవినీతి లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు.పేద వాళ్లకు మంచి చేకూరేలా మీరు పని చేయాలని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టింది సర్వే కాదు.. ఎలిజబులిటీ ఆఫ్ ఇందిరమ్మ ఇల్లు పరిశీలన అని వివరించారు.
దరఖాస్తుదారుడు ఇచ్చిన వివరాలు నిజమా కాదా అనేది పూర్తి బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్లలో నిరుపేద వారికి మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. అధికారుల విధుల సంబంధించి ముఖ్యమైన అంశాలు వెల్లడించారు. పాత కాంట్రాక్టర్ అనుకూలంగా ఉంటే వాళ్ళతో నిర్మాణం చేయాలని.. లేదంటే లబ్ధిదారులను గుర్తించి వారు నిర్మాణం చేసుకుంట అంటే నిధుల మంజూరు చేస్తామన్నారు. లబ్ధిదారులను గుర్తించడంలో చిన్న తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. గతంలో స్లాబ్ వేసి 3 సంవత్సరాల నుండి నిర్మాణం జరిగాక లబ్ధి దారులకు మంజూరు కాలేదనే విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి వాటికి వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ టవర్స్ విషయంలో పూర్తికాని వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు.
Also Read: Fibernet : ఏపీ ఫైబర్ నెట్ కీలక నిర్ణయం..410 మంది ఉద్యోగుల తొలగింపు..!
పూర్తి చేయడానికి మరోసారి కాంట్రాక్టర్ కు అవకాశం ఇవ్వనున్నారు. పాత రెట్ల ప్రకారం కాంట్రాక్టర్ ముందుకు రాకపోతే కాంట్రాక్ట్ క్లోజ్ చేయమన్నారు. గ్రీన్ ఛానెల్ ద్వారా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎవరి మీద కోపం లేదని.. పేద వాడికి ఇండ్లు ఇవ్వడమే తన లక్ష్యమని మంత్ర స్పష్టం చేశారు. అధికారులు ఎలాంటి ఒత్తిడి, ప్రలోభాలకు గురి కావద్దని తెలిపారు. అధికారుల తప్పులు చేస్తే చర్యలు తప్పవని, ఈ విషయంలో సీఎం రేవంత్ కూడా ఏమనేది లేదని అన్నారు. అన్ని ఇళ్లకు జాతీయ రంగు ఉండాలన్నారు.
33 జిల్లాలకు ప్రాజెక్ట్ డైరెక్టర్లు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తూ 33 జిల్లాలకు ప్రాజెక్టు డైరెక్టర్లను ప్రభుత్వం తాజాగా నియమించింది. ఈరోజు వారికి బాధ్యతలు అప్పగిస్తూ మంత్రి పొంగులేటి నియామక ఉత్తర్వులు అధికారులకు అందజేయనున్నారు.