HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Elderly Man Duped Of Rs 13 Crore In Largest Cyber Fraud Case In Telangana Three Arrested

Largest Cyber Fraud Case : హైదరాబాద్‌లో భారీ సైబర్ ఫ్రాడ్.. విశ్రాంత ఉద్యోగికి రూ.13.26 కోట్లు కుచ్చుటోపీ

దీంతో హైదరాబాద్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి లబోదిబోమంటూ పోలీసులను(Largest Cyber Fraud Case) ఆశ్రయించాడు.

  • By Pasha Published Date - 04:57 PM, Thu - 5 September 24
  • daily-hunt
Ransomware Attack

Largest Cyber Fraud Case : సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్​లో ఇద్దరిని మోసం చేసి ఒక్క రోజులోనే దాదాపు రూ.15 కోట్లను వాళ్లు దొంగిలించారు. అయితే ఒకే వ్యక్తి (విశ్రాంత ఉద్యోగి) నుంచి దాదాపు రూ.13.26 కోట్లను సైబర్ కేటుగాడు కొల్లగొట్టాడు. ఒకే బాధితుడు ఇంత స్థాయిలో మోసపోవడం దేశంలోనే ఇదే తొలిసారి అని పోలీసులు అంటున్నారు. వివరాలివీ..

Also Read :27000 Job Cuts : ఆగస్టులో 27వేల జాబ్స్ కట్.. ఏడాదిలో 1.36 లక్షల ఉద్యోగ కోతలు

హైదరాబాద్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి వాట్సాప్ నంబరుకు ఒక మెసేజ్ వచ్చింది. ఆన్‌లైన్‌ స్టాక్‌ బ్రోకింగ్‌ చిట్కాలను అందిస్తామని అందులో రాసి ఉంది. సదరు లింకును క్లిక్ చేసి విశ్రాంత ఉద్యోగి ఓ వాట్సాప్ గ్రూపులో చేరాడు. ఆ గ్రూపులో కొన్ని నకిలీ వెబ్‌సైట్ల యూఆర్‌ఎల్స్, యాప్‌ల లింక్‌లను సైబర్ కేటుగాళ్లు షేర్ చేశారు. తమను తాము ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ కంపెనీల అధికార ప్రతినిధులుగా సైబర్ మోసగాళ్లు పరిచయం చేసుకున్నారు. అది నిజమేనని విశ్రాంత ఉద్యోగి భావించాడు. వాళ్లు చెప్పిన వెబ్‌సైటుకు వెళ్లి పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈక్రమంలో డబ్బును తమ బ్యాంకు అకౌంట్లకు పంపాలని సైబర్ కేటుగాళ్లు ఆయనకు సూచించారు. ఆయన వెంటనే మనీని వారికి పంపారు. షేర్లలో ఆ డబ్బును పెట్టుబడిపెట్టామని చెప్పిన కేటుగాళ్లు.. తొలుత కొంతకొంత లాభం వచ్చినట్టుగా ప్రూఫ్స్ చూపించారు. మీకు అవసరమైనప్పుడు ఆ ఫండ్స్‌ను వెనక్కి తీసుకోవచ్చని విశ్రాంత ఉద్యోగిని నమ్మించారు. చివరకు ఆ సైబర్ కేటుగాళ్లు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేశారు.

Also Read :BIG Move On Agnipath : అగ్నివీరులకు గుడ్ న్యూస్.. అగ్నిపథ్ స్కీంలో కీలక సవరణలు!

దీంతో హైదరాబాద్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి లబోదిబోమంటూ పోలీసులను(Largest Cyber Fraud Case) ఆశ్రయించాడు. ఈ నెల 2న తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ)కు ఫిర్యాదు చేశాడు. తన దగ్గరి నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.13.26 కోట్లను దొంగిలించారంటూ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌ హిమాయత్‌నగర్​కు చెందిన మెట్రో రైలు ఉద్యోగి మహ్మద్‌ అతీర్‌ పాషా(25) బ్యాంకు ఖాతాకు కొంత సొమ్ము బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు.అతడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో మరో ఇద్దరు యువకుల పాత్ర బయటపడింది. హిమాయత్‌నగర్‌కు చెందిన అరాఫత్‌ ఖాలేద్‌ మొహియుద్దీన్‌(25), చార్మినార్‌ ఫతేదర్వాజాకు చెందిన సయ్యద్‌ ఖాజా హషీముద్దీన్‌(24) తనతో బ్యాంకు ఖాతా తెరిపించారని అతీర్‌పాషా చెప్పాడు. మ్యూల్‌(కమీషన్‌ కోసం బ్యాంకు ఖాతాను తెరవడం) అకౌంట్‌గా తన ఖాతాను వినియోగించుకున్నారని అతీర్‌పాషా చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Also Read :BJP Denied Ticket To Yogeshwar Dutt : యోగేశ్వర్‌దత్‌కు బీజేపీ మొండిచెయ్యి.. టికెట్ రాకపోవడంపై కవితాత్మక పోస్ట్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • Cyber Crime In Hyderabad
  • Elderly Man Duped
  • Largest Cyber Fraud Case
  • telangana

Related News

Chandrababu's speed in AP's development: Malla Reddy praises

Malla Reddy : ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు స్పీడ్ : మల్లారెడ్డి ప్రశంసలు

ఎన్టీఆర్‌ ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు గారు ఏపీలో అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు. ప్రధాని మోడీ కూడా ఏపీ అభివృద్ధికి లక్షల కోట్లు కేటాయిస్తున్నారు. ఈ కలయికతో రాష్ట్రం అభివృద్ధి శిఖరాలు అధిరోహిస్తోంది అని మల్లారెడ్డి తెలిపారు.

  • Group1 Exam Case

    Group-1 Case : గ్రూప్-1 వ్యవహారంపై నేడే తీర్పు

  • KTR responds for the first time on MLC Kavitha's suspension..what does he mean..?

    KTR : ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ పై తొలిసారి స్పందించిన కేటీఆర్..ఏమన్నారంటే..?

  • Strategic discussions to achieve 42% reservation for BCs: Telangana Jagruti President Kavitha

    Kavitha : బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు వ్యూహాత్మక చర్చలు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

  • Congress has no moral right to speak on Kamareddy land: Ramachandra Rao

    BJP : కామారెడ్డి గడ్డ మీద మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు: రామచందర్ రావు

Latest News

  • Range Rover Car : GST ఎఫెక్ట్ తో రూ.30 లక్షలు తగ్గిన కార్

  • Bellam Konda Srinivas : ఆలా చేస్తే ఇండస్ట్రీని వదిలివెళ్తా- బెల్లంకొండ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు

  • Trump : దిగొచ్చిన అమెరికా అధ్యక్షుడు..ప్రధాని మోడీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా..

  • AP : ఏపీలో పీపీపీ ద్వారా కొత్త దిశ..10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం

  • Flop Combination : ప్లాప్ డైరెక్టర్ తో ప్లాప్ హీరో కాంబో..? హిట్ పడేనా..?

Trending News

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd