BIG Move On Agnipath : అగ్నివీరులకు గుడ్ న్యూస్.. అగ్నిపథ్ స్కీంలో కీలక సవరణలు!
అగ్నివీరులు(BIG Move On Agnipath) నాలుగేళ్ల పాటు సైన్యానికి సేవలు అందించిన తర్వాత , వారిలో 50 శాతం మందిని ఆర్మీలోకి పర్మినెంటు ప్రాతిపదికన తీసుకోవాలని రక్షణశాఖకు ఆర్మీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.
- By Pasha Published Date - 04:02 PM, Thu - 5 September 24

BIG Move On Agnipath : అగ్నిపథ్ స్కీంలో కీలక మార్పుల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్డీయే కూటమిలోని జేడీయూ, ఎల్‌జేపీలు అగ్నిపథ్ స్కీంలో సంస్కరణలు చేయాల్సిందే అని తేల్చి చెబుతున్నాయి. ఈనేపథ్యంలో మోడీ సర్కారు దిద్దుబాటు చర్యలకు రెడీ అవుతోంది.
Also Read :BJP Denied Ticket To Yogeshwar Dutt : యోగేశ్వర్‌దత్‌కు బీజేపీ మొండిచెయ్యి.. టికెట్ రాకపోవడంపై కవితాత్మక పోస్ట్
అగ్నివీరులుగా భర్తీ అయ్యే వారు నాలుగేళ్ల తర్వాత విధుల నుంచి వైదొలగాలని ప్రస్తుత రూల్స్ చెబుతున్నాయి. వారిలో 25 శాతం మందినే రెగ్యులర్ సర్వీసుల్లోకి తీసుకుంటారనే నిబంధన ఇప్పుడు అమలవుతోంది. రెగ్యులర్ సర్వీసుల్లోకి తీసుకునే వారి సంఖ్యను త్వరలోనే పెంచుతారని పేర్కొంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అగ్నివీరులు(BIG Move On Agnipath) నాలుగేళ్ల పాటు సైన్యానికి సేవలు అందించిన తర్వాత , వారిలో 50 శాతం మందిని ఆర్మీలోకి పర్మినెంటు ప్రాతిపదికన తీసుకోవాలని రక్షణశాఖకు ఆర్మీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు అగ్నివీరుల వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచాలని కోరిందని సమాచారం. అగ్నివీరుల జీతభత్యాలలోనూ మార్పులు చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. . సైన్యంలో అంతర్గతంగా పలు సర్వేలను నిర్వహించిన తర్వాత ఇటీవలే పలు ప్రతిపాదనలను రక్షణశాఖకు ఆర్మీ పంపిందట.
Also Read :Russia and Ukraine Talks : భారత్, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహిస్తే శాంతిచర్చలకు రెడీ : పుతిన్
అగ్నివీరులను ఆర్మీలోకి తీసుకునే ముందు ఎంతో అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణను అందిస్తారు. అంతటి శిక్షణ ఇచ్చాక కేవలం నాలుగేళ్లను వాళ్లను వదిలేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని సైనిక వర్గాలు అభిప్రాయపడుతున్నారు. సాధ్యమైనంత ఎక్కువ కాలం పాటు వారిని సైన్యం కోసం వాడుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. అగ్నివీరులను విధుల్లోకి వచ్చిన నాలుగేళ్లకే వదులుకుంటే.. రానున్న కొన్నేళ్లలో సైన్యం సంఖ్య తగ్గిపోతుందనే ఆందోళన కూడా రక్షణ రంగ నిపుణుల్లో వ్యక్తమవుతోంది.2022 జూన్‌లో అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 17 నుంచి 21 ఏళ్లలోపు యువతీ యువకులుఅగ్నివీర్‌లుగా చేరేందుకు అర్హులు అని వెల్లడించింది.