27000 Job Cuts : ఆగస్టులో 27వేల జాబ్స్ కట్.. ఏడాదిలో 1.36 లక్షల ఉద్యోగ కోతలు
జర్మనీకి చెందిన చిప్ మేకింగ్ కంపెనీ ఇన్ఫీయన్ 1400 మంది సిబ్బందిని(27000 Job Cuts) తీసేసింది.
- By Pasha Published Date - 04:24 PM, Thu - 5 September 24

27000 Job Cuts : జాబ్స్ చేసే వారిని కలవరపెట్టే న్యూస్ ఇది. అదేమిటంటే.. ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రపంచవ్యాప్తంగా 27వేల మంది జాబ్స్ కోల్పోయి రోడ్డునపడ్డారు. ప్రఖ్యాత టెక్ కంపెనీలు పెద్దసంఖ్యలో తమ ఉద్యోగులను జాబ్స్ నుంచి తొలగించాయి. ఇలా ఉద్యోగులను తగ్గించుకున్న కంపెనీల జాబితాలో ఇంటెల్, సిస్కో, ఐబీఎం, అమెజాన్, ట్విట్టర్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ సహా దాదాపు 40కిపైగా కంపెనీలు ఉన్నాయి. ఈ ఏడాది మొత్తంగా చూస్తే 2024 సంవత్సరంలో దాదాపు 422 కంపెనీలు 1.36 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తీసేశాయి.
Also Read :BIG Move On Agnipath : అగ్నివీరులకు గుడ్ న్యూస్.. అగ్నిపథ్ స్కీంలో కీలక సవరణలు!
- ప్రముఖ నెట్ వర్కింగ్ ఈక్విప్‌మెంట్ తయారీ కంపెనీ సిస్కో (Cisco) ఈ ఏడాది రెండుసార్లు ఉద్యోగ కోతలకు పాల్పడింది. రెండో విడతలో 5,900 మందిని జాబ్స్ నుంచి తీసేసింది. అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మరో 4 వేల మందిని జాబ్స్ నుంచి తొలగించింది. కంపెనీ వ్యాపారం తగ్గిపోవడం, సప్లై చైన్ సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిస్కో వెల్లడించింది.
- జర్మనీకి చెందిన చిప్ మేకింగ్ కంపెనీ ఇన్ఫీయన్ 1400 మంది సిబ్బందిని(27000 Job Cuts) తీసేసింది.
- ఐబీఎమ్ కంపెనీ వెయ్యి మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పింది.
- కెనడియన్ ఆన్‌లైన్ ఫుడ్ సర్వీస్ కంపెనీ స్కిప్ ది డిషెసెస్ 800 మందిని జాబ్స్ నుంచి తొలగించింది.
- యాపిల్ కంపెనీ 600 మంది ఉద్యోగులను జాబ్స్ నుంచి తప్పించింది. వీరిలో చాలామంది స్మార్ట్ కారు, స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లేకు సంబంధించిన సెక్షన్లలో పనిచేసేవారు. కంపెనీ ఖర్చులను కంట్రోల్ చేసేందుకు జాబ్ కట్స్ చేశామని యాపిల్ స్పష్టం చేసింది.
- ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ తన క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం నుంచి వందలాది మందిని తీసేసింది.
- దివాలా తీసిన భారతీయ కంపెనీ బైజూస్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో 500 మందిని జాబ్స్ నుంచి తీసేశారు.
- అపర కుబేరుడు ఎలాన్‌మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా నుంచి వందలాది మందిని జాబ్స్ నుంచి తీసేశారు.
- డెల్ కంపెనీ గత 15 నెలల్లో రెండు సార్లు ఉద్యోగులను తీసేసింది. మొత్తంమీద 12,500 మందిని జాబ్స్ నుంచి తప్పించింది. ఏఐతో పాటు ఆధునిక ఐటీ సొల్యూషన్స్‌పై దృష్టిపెట్టామని, పాతతరం స్కిల్స్ కలిగిన వారు తమకు అక్కరలేదని డెల్ స్పష్టం చేసింది.