BJP Denied Ticket To Yogeshwar Dutt : యోగేశ్వర్‌దత్‌కు బీజేపీ మొండిచెయ్యి.. టికెట్ రాకపోవడంపై కవితాత్మక పోస్ట్
అందుకే ఈసారి యోగేశ్వర్‌కు(BJP Denied Ticket To Yogeshwar Dutt) టికెట్ ఇవ్వలేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
- By Pasha Published Date - 03:40 PM, Thu - 5 September 24
BJP Denied Ticket To Yogeshwar Dutt : హర్యానా అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో అధికార పీఠంపై ఉన్న బీజేపీ బుధవారం రోజు 67 మంది అభ్యర్థుల పేర్లతో తొలిజాబితాను విడుదల చేసింది. అయితే ఈసారి 9 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీజేపీ షాక్ ఇచ్చింది. వారికి బదులు కొత్త వారికి ఆయా 9 స్థానాల నుంచి అవకాశం కల్పించింది. ఈసారి అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడిన ప్రముఖుల్లో రెజ్లర్ యోగేశ్వర్ దత్ కూడా ఉన్నారు. తనకు టికెట్ రాకపోవడంపై ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. తన ఆవేదనను ఓ కవిత రూపంలో తోటి నెటిజన్లతో పంచుకున్నారు.
Also Read :Russia and Ukraine Talks : భారత్, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహిస్తే శాంతిచర్చలకు రెడీ : పుతిన్
వ్యక్తిత్వం స్వచ్ఛంగా ఉన్నప్పుడు..
‘‘హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాను. నా అభిప్రాయాన్ని సీఎం, కేంద్ర నాయకత్వం ఎదుట వెలిబుచ్చాను. నేనొక క్రీడాకారుడిని. ఒలింపిక్ విజేతను. గతంలో బీజేపీ తరఫున పోటీ చేశాను. కాబట్టి నాకు మరోసారి ఛాన్స్ దక్కాలని ఆశిస్తున్నాను’’ అని గతవారం రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. అయినా ఆయనకు అసెంబ్లీ టికెట్ దక్కలేదు. దీంతో ఆయన చాలా బాధపడ్డారు. ఆ బాధకు అక్షరరూపం కల్పిస్తూ.. ‘‘నీ వ్యక్తిత్వం స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది ? నన్ను పరీక్షించే హక్కు నా ప్రత్యర్థులకు లేదు. మిమ్మల్ని మీరు కనుగొనేందుకు శోధన ప్రారంభించండి’’ అంటూ కవితాత్మకంగా ఒక వీడియోను యోగేశ్వర్ దత్ షేర్ చేశారు. అంతర్జాతీయ వేదికలపై తన రెజ్లింగ్ ప్రత్యర్థులతో పోటీ పడిన ఫొటోలను దానికి ఆయన జతపరిచారు.
Also Read :MLA Koneti Adimulam Suspended : ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ సస్పెన్షన్ వేటు.. లైంగిక వేధింపుల ఆరోపణల పర్యవసానం
టికెట్ దక్కకపోవడంతో.. హర్యానా మంత్రి రాజీనామా
వాస్తవానికి యోగేశ్వర్‌దత్ కు గతంలో బీజేపీ రెండుసార్లు ఛాన్స్ ఇచ్చింది. 2019లో హర్యానాలోని బరోడా అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఆయన ఓటమి ఎదురైంది. హుడా మృతితో అక్కడ బైపోల్ జరిగింది. అందులో పోటీ చేసినా యోగేశ్వర్‌దత్ గెలవలేకపోయారు. రెండోసారి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఇందురాజ్ నర్వాల్ విజయఢంకా మోగించారు. అందుకే ఈసారి యోగేశ్వర్‌కు(BJP Denied Ticket To Yogeshwar Dutt) టికెట్ ఇవ్వలేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజ్రంగ్ పునియాలకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చింది. త్వరలోనే హస్తం పార్టీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయబోతోంది. మరోవైపు వినేష్ ఫోగట్ సోదరి బబిత 2019 నుంచి బీజేపీలో ఉన్నారు. గత ఎన్నికల్లో హర్యానాలోని దాద్రి నుంచి బబిత పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా ఆమెకు టికెట్ కేటాయిస్తారని తెలుస్తోంది. బబితపై పోటీకి వినేష్‌ను బరిలోకి దింపాలని కాంగ్రెస్ అనుకుంటోంది. కాగా, ఈసారి బీజేపీ టికెట్ రాకపోవడంతో హర్యానా మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా ఆవేదనకు గురయ్యారు. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Tags
Related News
Kashmir Elections : బీజేపీతో పొత్తుపై మెహబూబా ముఫ్తీ కీలక ప్రకటన
జమ్మూ కాశ్మీర్ లో ఏర్పాటయ్యే తదుపరి ప్రభుత్వంలో తప్పకుండా పీడీపీ కీలక పాత్ర పోషిస్తుందని మెహబూబా ముఫ్తీ విశ్వాసం వ్యక్తం చేశారు.