Formula E Race Case : కేటీఆర్ కు ఈడీ షాక్
Formula E Race Case : ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలో దిగింది. ఈ కేసుకు సంబందించిన ఎఫ్ ఐ ఆర్ పాటు అన్ని వివరాలను తమకు పంపాలని ఈడీ అధికారులు శుక్రవారం ఎసిబికి లేఖ రాశారు
- By Sudheer Published Date - 08:35 PM, Fri - 20 December 24

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫార్ములా ఈ కార్ రేసు(Formula E Race Case)కు సంబంధించి శుక్రవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై ఇప్పటికే ఏసీబీ (ACB) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఏ 1గా బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కెటిఆర్ (KTR), ఏ2గా సీనియర్ ఐఎఎస్ అధికారి ఆర్వింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండిఎ మాజీ ఉన్నతాధి బిఎల్ఎన్ రెడ్డిలను చేర్చడం జరిగింది.
కాగా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలో దిగింది. ఈ కేసుకు సంబందించిన ఎఫ్ ఐ ఆర్ పాటు అన్ని వివరాలను తమకు పంపాలని ఈడీ అధికారులు శుక్రవారం ACBకి లేఖ రాశారు. ఈ కార్ రేసు కేసులో విదేశీ కంపెనీకి 55 కోట్ల రూపాయల చెల్లింపులు అక్రమంగా జరిగాయని, ఇందులో 45 కోట్ల రూపాయలు విదేశీ నగర రూపంలో చెల్లించారని ACB విచారణలో తేలింది. ఈ చెల్లింపులన్నీ చట్ట వ్యతిరేకంగా జరిగినట్లు కూడా ACB నిర్దారించింది. కేబినెట్ లేకుండా, ఆర్థిక శాఖ నుంచి అనుమతి లేకుండా ఇదంతా జరిగాయని ACB విచారణలో పేర్కోవడం జరిగింది. వీటన్నింటి నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మనీలాండరింగ్ జరిగిందని భావిస్తున్న ED అధికారులు ఇందులోని నిజానిజాలను వెలికితీసేందుకు ACB నుంచి వివరాలను తీసుకోబోతుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేటీఆర్, అర్వింద్ కుమార్, BLN రెడ్డిలపై కేసు నమోదు చేసింది. ఏసీబీ FIRలో ఉన్న అంశాలనే ఈడీ ECIRలో ప్రస్తావించింది. రూ.55 కోట్ల ఆర్థిక లావాదేవీల్లో ఎవరెవరి ప్రమేయం ఉందనే దానిపై దర్యాప్తు చేయనుంది.
Read Also : Taj -Ayodhya : తాజ్ మహల్ కళ తప్పుతుంది..రామాలయానికి వెలుగు పెరుగుతుంది