Eatala Rajender: కాంగ్రెస్ లోకి ఈటెల?.. మల్కాజిగిరి ఎంపీగా పోటీ
హుజూరాబాద్, గజ్వేల్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన బీజేపీ నేత ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
- Author : Praveen Aluthuru
Date : 28-12-2023 - 3:18 IST
Published By : Hashtagu Telugu Desk
Eatala Rajender: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ అధికారం చేపట్టింది. రెండు పర్యాయాలు ప్రభుత్వం నడిపించిన కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో కొనసాగుతున్నారు. ఆ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన బీజేపీ నేత ఈటల రాజేందర్ కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
గతంలో భారత రాష్ట్ర సమితిని వీడి బీజేపీలో చేరిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్లే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ పుకార్లను కొట్టిపారేసిన ఈటల రాజేందర్.. తనకు కాంగ్రెస్‌లో చేరే ఉద్దేశం లేదని తెలిపారు. తాను బీజేపీ నుంచి బయటకు రావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ లేదా ఇతర పార్టీ నాయకులూ పుకార్లు సృష్టిస్తున్నారని తేల్చేశారు.
తన ప్రణాళికలను వెల్లడిస్తూ, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డిపై ఈటల రాజేందర్ ఓడిపోయారు. గజ్వేల్‌లో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై 45031 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎమ్మెల్యేగా గెలవలేక పోయినా వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమయ్యారు.
Also Read: Praja Palana : రూ.50 , రూ.100 లకు అభయ హస్తం దరఖాస్తు పత్రాలను అమ్ముతున్న దళారులు